State Govt: 18న వినాయక చవితి సెలవు
ABN , First Publish Date - 2023-09-01T10:15:31+05:30 IST
వినాయక చవితి(Vinayakachaviti) సెలవు ఈనెల 18వ తేది అని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వినాయక చవితిని
పెరంబూర్(చెన్నై): వినాయక చవితి(Vinayakachaviti) సెలవు ఈనెల 18వ తేది అని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది వినాయక చవితిని ఈనెల 18న ప్రజలు జరుపుకోనుండగా, అందుకు ఒకరోజు ముందుగా 17వ తేది వినాయక చవితి సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనపై పలువురు పీఠాధిపతులు, మత పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా అమావాస్య నుంచి నాలుగో రోజు చదుర్ధి వస్తుందని, ఆ ప్రకారం శ్రావణ అమావాస్య నుంచి 4వ రోజు వినాయక చవితి జరుపుకుంటారని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై స్పందించిన రాష్ట్రప్రభుత్వం, ఇదివరకు ప్రకటించిన 17వ తేది వినాయక చవితి సెలవు రద్దుచేసి, 18వ తేది సెలవు దినంగా ప్రకటిస్తూ గురువారం జీవో విడుదల చేసింది.