Uttam: వేసవిలో ‘తుమ్మిడిహెట్టి’ పనులు: ఉత్తమ్
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:54 AM
సాంకేతిక పరమైన అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వచ్చే వేసవిలో చేవెళ్ల ప్రాణహిత -తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్, మార్చి17 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరమైన అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వచ్చే వేసవిలో చేవెళ్ల ప్రాణహిత -తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, తాతామధు, మధుసూదనాచారి, జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెబుతూ... చేవెళ్ల-ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మహారాష్ట్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయని మొత్తం 114 కి.మీ.లలో 104 కి.మీ. వరకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేసినట్టు వివరించారు.