Share News

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..

ABN , Publish Date - Mar 17 , 2025 | 08:21 PM

ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తాళి బొట్టు తీసేసి ఫొటోలు దిగేది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. భార్య చేసిన పనికి అతడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

Karnataka News: పెళ్లై రెండేళ్లు.. భార్య చేసిన పనికి భర్త షాకింగ్ నిర్ణయం..
Karnataka News

భార్యాభర్తల బంధం అన్న తర్వాత గొడవలు సహజం. ఆ గొడవల కారణంగా ఇద్దరి మధ్యా బంధం మరింత బలపడాలే కానీ, వీగిపోకూడదు. కానీ, నూటికి 70 శాతం భార్యాభర్తల బంధాల్లో గొడవలు దారుణాలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా .. ఆడవారి ప్రవర్తన కారణంగా మగవారు ప్రాణాలు తీసుకుంటున్నారు. గత కొన్ని నెలల నుంచి భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్న భర్తల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. భర్తల మనస్తత్వం తెలిసి కూడా కొందరు భార్యలు వారిని హింసిస్తున్నారు. సున్నిత మనస్కులను కూడా వదలటం లేదు. తాజాగా, భార్య వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు బట్టతల ఉందంటూ భార్య నిత్యం వేధించేది. ఆ వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవటంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్‌కు చెందిన పరశివమూర్తి అదే ప్రాంతానికి చెందిన మమతకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయే నాటికి కూడా అతడికి జుట్టు లేదు. అది తెలిసి కూడా మమత అతడ్ని పెళ్లి చేసుకుంది. పరశివమూర్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన కొన్ని నెలలకు జుట్టు మొత్తం పోయింది. భర్త బట్టతలపై మమత తరచుగా కామెంట్లు చేసేది. బట్ట తలతో బయట తిరగడానికి సిగ్గుగా లేదా? అనేది. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తాళి బొట్టు తీసేసి ఫొటోలు దిగేది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఈ విషయంలో ఇాద్దరి మధ్యా గొడవలు జరిగేవి. ఆ గొడవలు తారాస్థాయికి చేరటంతో మమత అతడిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో అతడు జైలు పాలయ్యాడు.


తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ టైంలో మమత వేధింపులు మరింత పెరిగాయి. పరశివమూర్తి బట్టతలపై దారుణమైన కామెంట్లు చేసేది. భార్య వేధింపులు భరించేకపోయిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పరశివమూర్తి ఆత్మహత్య సమాచారం పోలీసులకు అందింది. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాడీ స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఓ లేఖ దొరికింది. బట్టతలపై మమత చేస్తున్న కామెంట్లు భరించలేకే తాను చనిపోతున్నట్లు పరశివమూర్తి ఆ లేఖలో పేర్కొన్నాడు. మమతపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మమతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Arjun Reddy: గ్రూప్‌-3 టాపర్లూ పురుషులే..

నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్‌ భూములు కావు

కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 17 , 2025 | 08:22 PM