BJP MLA Caught: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపితే చేసేది ఇదా..!

ABN , First Publish Date - 2023-03-30T16:13:02+05:30 IST

జాతీయ మీడియా కథనాల ప్రకారం, శాసన సభలో సభాపతి, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్

BJP MLA Caught: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపితే చేసేది ఇదా..!
Tripural BJP MLA Jadav Lal Nath

న్యూఢిల్లీ : త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath) ఆ రాష్ట్ర శాసన సభలో తన స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ పాడుపనికి తెగబడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బాగ్బస్స నియోజకవర్గం నుంచి గెలిచారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, శాసన సభలో సభాపతి, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన మొబైల్ ఫోన్‌లో వివిధ వీడియోలను ఆసక్తిగా చూసినట్లు తెలుస్తోంది. ఆయన ఉద్దేశపూర్వకంగా ఓ వీడియోను మరింత ఆసక్తిగా చూసినట్లు, అది పోర్నోగ్రాఫిక్ వీడియో అని తెలుస్తోంది. ఆయన వీటిని చూసే సమయంలో ఆయన వెనుక కూర్చున్నవారు ఎవరో చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించి, జాదవ్ లాల్ నాథ్‌ను పిలిచి, వివరణ కోరినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆయన ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. సమావేశం ముగిసిన వెంటనే ఆయన శాసన సభ నుంచి నిష్క్రమించారు.

ఇదిలావుండగా, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, బీజేపీని బ్లూజేపీ అని, ఇది సిగ్గు చేటు అని దుయ్యబట్టారు. చాలా మంది ట్విటరాటీలు కూడా ఆ ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు.

బీజేపీ నేతలు పోర్న్ చిత్రాలను చూస్తూ పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. కర్ణాటక శాసన సభలో 2012లో బీజేపీ మంత్రులు లక్ష్మణ్ సావడి, సీసీ పాటిల్ తమ ఫోన్లలో పోర్న్ చూస్తూ పట్టుబడ్డారు. అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే వారు తప్పు చేయలేదని దర్యాప్తులో నిర్థరణ అయిన తర్వాత తిరిగి మంత్రివర్గంలో చేరారు.

ఇవి కూడా చదవండి :

Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్

Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-30T16:13:02+05:30 IST

News Hub