జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌తో ఎన్‌ఐఐఎఫ్ ఒప్పందం
ABN , First Publish Date - 2022-12-08T04:23:04+05:30 IST
జీఎంఆర్ ఎయుర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్), నేషనల్ ఇన్వె్‌స్టమెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) ఫైనాన్షియల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి...
3 విమానాశ్రయాల్లో పెట్టుబడులు
గోవా విమానాశ్రయంలో రూ.631 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీఎంఆర్ ఎయుర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్), నేషనల్ ఇన్వె్‌స్టమెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) ఫైనాన్షియల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా జీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయంతో సహా జీఎంఆర్‌కు చెందిన మూడు విమానాశ్రయాల్లో ఈక్విటీ రూపంలో ఎన్‌ఐఐఎఫ్ పెట్టుబడులు పెడుతుంది. ఇందుకోసం కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ల (సీసీడీ) రూపంలో జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో ఎన్‌ఐఐఎఫ్ ముందుగా రూ.631 కోట్ల పెట్టుబడులు పెడుతుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. దేశీయంగా విమానాశ్రయాల్లో ఎన్‌ఐఐఎ్‌ఫకు తొలి పెట్టుబడి ఇదే అవుతుంది.
ఏరోడ్రోమ్ లైసెన్స్.. : విమాన ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసి నిర్వహించడానికి 2016లో జీజీఐఏఎల్‌కు అనుమతి లభించింది. ఈ విమానాశ్రయానికి ఇప్పటికే ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహించే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నట్టు జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారం) జీబీఎస్ రాజు తెలిపారు.
హైదరాబాద్ విమానాశ్రయానికి సీఐఐ అవార్డు: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఐఐ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. గోల్డ్ కేటగిరీలో ఈ గుర్తింపు లభించినట్లు జీఎంఆర్ వెల్లడించింది.