SSC exams: ‘పది’ పరీక్షకు హాజరైన చిన్నారి
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:38 AM
స్థానిక మౌంట్ కార్నెల్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసింది. చిన్నారి తన స్నేహితులను కలిసిన సమయంలో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. డీఈవో శామ్యూల్ పాల్ పరీక్ష కేంద్రానికి చేరుకుని, పరీక్ష రాస్తున్న ఆ బాలికకు ధైర్యం చెప్పారు.

కోసిగి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన విద్యార్థిని సన్నక్కి చిన్నారి శుక్రవారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యింది. స్థానిక మౌంట్ కార్నెల్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసింది. చిన్నారి తన స్నేహితులను కలిసిన సమయంలో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. డీఈవో శామ్యూల్ పాల్ పరీక్ష కేంద్రానికి చేరుకుని, పరీక్ష రాస్తున్న ఆ బాలికకు ధైర్యం చెప్పారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థినితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆమె కష్టాలు తెలుసుకున్నారు. గైర్హాజరైన రెండు సబ్జెక్టులకు సప్లిమెంటరీ రాయిస్తామని, ఆందోళన వద్దని సూచించారు. పరీక్ష రాసేందుకు రానుపోను ఖర్చుల కోసం రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. డీఈవో మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం ఒక విద్యార్థిని జీవితాన్ని కాపాడిందని ప్రశంసించారు. మిరప కోత పనుల కోసం చిన్నారి తల్లిదండ్రులతో పాటు గుంటూరు వలస వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 19న ‘పరీక్ష హాలులో కాదు.. వలస వెళ్లి పొలంలో’ శీర్షికన కథనం ఇచ్చింది. దీనిపై విద్యాశాఖ మంత్రి మంత్రి లోకేశ్ స్పందించి వెంటనే విద్యార్థిని పరీక్షలకు హాజరయ్యేలా అధికారులను ఆదేశించారు.