Share News

Bengaluru: బెంగళూరులో ఏపీఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:20 AM

కేఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ హనుమంత చలవాది ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గురువారం రాత్రి మెజిస్టిక్‌ బస్టాండులో శ్రీసత్యసాయి జిల్లా కదిరి బస్సు బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కేఎస్‌ ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు అడ్డంగా ఉంచుతావా అంటూ కదిరి బస్సు డ్రైవర్‌తో కేఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌ వాగ్వాదానికి దిగాడు.

Bengaluru: బెంగళూరులో ఏపీఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

ముఖంపై పిడిగుద్దులు, కాలితో తన్నుతూ వీరంగం వేసిన కేఎ్‌సఆర్టీసీ బస్సు డ్రైవర్‌

ప్రొద్దుటూరు బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బెంగళూరు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): బెంగళూరు మెజిస్టిక్‌లోని కేఎస్‌ ఆర్టీసీ బస్టాండులో ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రవిశంకర్‌రెడ్డిపై దాడి జరిగింది. కేఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ హనుమంత చలవాది ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గురువారం రాత్రి మెజిస్టిక్‌ బస్టాండులో శ్రీసత్యసాయి జిల్లా కదిరి బస్సు బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో కేఎస్‌ ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు అడ్డంగా ఉంచుతావా అంటూ కదిరి బస్సు డ్రైవర్‌తో కేఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌ వాగ్వాదానికి దిగాడు. అంతలోనే కడప జిల్లా ప్రొద్దుటూరు బస్సు డ్రైవర్‌ రవిశంకర్‌రెడ్డి అక్కడికి వెళ్లి జోక్యం చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన కేఎస్‌ ఆర్టీసీ డ్రైవర్‌ హనుమంత.. రవిశంకర్‌ రెడ్డి ముఖంపై పిడిగు ద్దు గుద్దాడు. కిందకు పడిపోయినా వదలకుండా కాలితో తన్నాడు. దాడిలో గాయపడ్డ రవిశంకర్‌రెడ్డిని ఇతర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అతని ముఖంపై వైద్యులు ఐదు కుట్లు వేశారు. కేఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్‌ హనుమంతపై సస్పెన్షన్‌ వేటు వేశారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:20 AM