Microsoft Wordpad!: మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ప్యాడ్‌కు స్వస్తి!

ABN , First Publish Date - 2023-09-08T23:36:01+05:30 IST

మైక్రోసాఫ్ట్‌ - టెక్స్ట్‌ ఎడిటింగ్‌ టూల్‌ ‘వర్డ్‌ ప్యాడ్‌’కు చరమగీతం పాడనుంది. ముప్పయ్‌ సంవత్సరాలుగా ఇది పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీని విషయంలో ఇకపై ఎలాంటి అప్డేట్స్‌ ఉండవు. నోట్‌ప్యాడ్‌, స్నిప్పింగ్‌ టూల్‌కు ఇటీవలే కొన్ని అప్‌గ్రేడ్స్‌ ప్రకటించింది.

Microsoft Wordpad!: మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ప్యాడ్‌కు స్వస్తి!

మైక్రోసాఫ్ట్‌ - టెక్స్ట్‌ ఎడిటింగ్‌ టూల్‌ ‘వర్డ్‌ ప్యాడ్‌’కు చరమగీతం పాడనుంది. ముప్పయ్‌ సంవత్సరాలుగా ఇది పనిచేస్తున్న సంగతి తెలిసిందే. దీని విషయంలో ఇకపై ఎలాంటి అప్డేట్స్‌ ఉండవు. నోట్‌ప్యాడ్‌, స్నిప్పింగ్‌ టూల్‌కు ఇటీవలే కొన్ని అప్‌గ్రేడ్స్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వర్డ్‌ ప్యాడ్‌కు మంగళం పాడటం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. విండోస్‌ 95 నుంచి మైక్రోసాఫ్ట్‌లో వర్డ్‌పాడ్‌ భాగంగా ఉంది. దానికి బదులుగా మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ను రికమెండ్‌ చేస్తోంది. ‘ద వెర్జ్‌’ నివేదిక ప్రకారం ఇటీవలి సంవత్సరాల్లో వర్డ్‌ ప్యాడ్‌పై మైక్రోసాఫ్ట్‌ దృష్టి సారించడం లేదు. వచ్చే ఏడాది విండోస్‌ 12 విడుదల కానున్న సమయంలో వర్డ్‌ప్యాడ్‌కు తొలగించే అవకాశం ఉంది. అలాగే విండోస్‌ 1123హెచ్‌2 అప్డేట్‌ని పరిచయం చేసే పనిలో మైక్రోసాఫ్ట్‌ ఉంది. ఏఐ అసిస్టెంట్‌ ‘మైక్రోసాఫ్ట్‌ కోపైలెట్‌’గా తీసుకొస్తోంది. అప్‌కమింగ్‌ అప్డేట్‌ ఈ నెల 21న రిలీజ్‌ కావచ్చని కూడా భావిస్తున్నారు.

Updated Date - 2023-09-08T23:36:01+05:30 IST