Newborn Care Tips: అప్పుడే పిల్లల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కష్టమే..!
ABN , First Publish Date - 2023-02-28T13:16:58+05:30 IST
పిల్లల్లో నిద్ర సమంగా ఉండడానికి కూడా సరైన వాతావరణం చాలా అవసరం.
అప్పుడే పుట్టిన పిల్లల్ని సాకడం అంటే మాటలు కాదు. దానికి చాలా అనుభవం ఉన్న పెద్దాళ్లు పక్కన ఉండవలసిందే.. కొత్తగా ప్రపంచంలోకి వచ్చిన శిశువు శ్వాస తీసుకోవడానికి, జీర్ణక్రియలోనూ మార్పులతో సహా అనేక శారీరక మార్పులకు లోనవుతుంది. నవజాత శిశువు గాలి పీల్చడం, మింగడం వంటి చర్యలకు ఆహారం కూడా చాలా అవసరమైన ప్రక్రియ. అయితే ఈ శిశువుల విషయంలో ఆహారం, డైపర్ మార్పులు, అనారోగ్య సమస్యలను పరిశీలించడం, అనేది స్థిరమైన శ్రద్ధ తీసుకోవలసిన అంశం. పిల్లల్లో నిద్ర సమంగా ఉండడానికి కూడా సరైన వాతావరణం చాలా అవసరం. ఈ శిశువులు అంటువ్యాధులు, కామెర్లు, ఆకస్మిక శిశు డెత్ సిండ్రోమ్ (SIDS) వంటి కొన్ని ఆరోగ్య ప్రమాదాలకు గురవకుండా చూసుకోవడం ముఖ్యం. శిశువుకు సరైన వైద్య సంరక్షణ, పర్యవేక్షణ చాలా అవసరం.
నవజాత శిశువుకు చేయకూడని 7 పనులు ఏంటంటే:
1. బిడ్డను కదిలించకండి: బిడ్డను పడుకున్న సమయంలో కదిలించడం, పదే పదే ఆడుకోవడం, నిద్రను భంగం కానివ్వడం వల్ల మెదడు దెబ్బతినడానికి, మరణానికి కారణమవుతుంది. శిశువును కదిలించడం, ఆడటం మానుకోవాలి.
2. శిశువు చుట్టూ పొగ: శ్వాసకోశ అంటువ్యాధులు, ఆకస్మిక శిశు డెత్ సిండ్రోమ్ (SIDS), పిల్లలలో ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శిశువును ధూమపానం చేసేవారి నుండి దూరంగా ఉంచండి. పొగ లేకుండా చూసుకోవాలి.
3. శరీర ఉష్ణోగ్రత అవసరం: పిల్లలకు శరీర ఉష్ణోగ్రతను కాపాడాలి. శరీరాన్ని వేడిగా ఉంచకపోతే.., అలసట, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శిశువును దుస్తులతో చుట్టి ఉంచడం చాలా అవసరం.
4. పొట్టపై నిద్రపోనీయకండి : పిల్లల్ని పొట్టమీద పడుకోబెట్టుకోవడం చాలామంది తల్లులు చేసే పని. ఇలా చేయడం వల్ల సిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలా కాకుండా పసి పిల్లల్ని మృదువైన పరుపుపైన పడుకోబెట్టడం మంచిది.
5. బేబీ వాటర్ : నవజాత శిశువుకు తల్లి పాలకన్నా సురక్షితమైనవి ఇంకోటి లేవు. మరీ ఆరోగ్య సమస్యలు తలెత్తితే డాక్టర్ సలహా మేర మందులు ఇవ్వాలి తప్పితే సొంత వైద్యం చేయకూడదు. బేబీ వాటర్ వంటివి ఇవ్వడం వారి ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ప్రాణ హాని కూడా కలిగించవచ్చు.
6. పెంపుడు జంతువులు: ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతులవల్ల కూడాశిశువుకు హాని కలగవచ్చు.
7. వైద్య సంరక్షణ ఆలస్యం: బిడ్డలో అనారోగ్యం లేదా అసాధారణ ప్రవర్తన గమనించినట్లయితే, వైద్య సంరక్షణ తీసుకోవడం ఆలస్యం చేయవద్దు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.