Health Tips: కొవ్వును కరిగించే ఆరు డ్రింకులు.. డైట్‌లు, కసరత్తులతోనే కాదండోయ్.. వీటిని తాగినా బరువు తగ్గొచ్చు..!
ABN , First Publish Date - 2023-10-04T15:53:20+05:30 IST
ఒక కప్పు నీటిలో దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను తాగడం వల్ల రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా జీర్ణక్రియ, హైడ్రేషన్‌లో కూడా సహాయపడుతుంది.
పెద్ద బాన పొట్ట వచ్చేసిందని బాధపడని వారుండరు. మరీ శరీరం బానలా కనిపిస్తుందని అనుకుంటూనే ఉంటారు. ఫ్యాట్ అనేది ఈరోజు చాలా మందిని వేధిస్తున్న సమస్య. విసెరల్ కొవ్వు ఆరోగ్యానికి హానికరం. ఈ కొవ్వు కాలేయం, పొట్ట, పేగుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొత్తికడుపు కొవ్వు లేదా విసెరల్ బాడీ ఫ్యాట్ అన్నింటికంటే ప్రమాదకరమైనవి. రోజూ ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే పొట్ట కొవ్వు పోతుంది. ఓసారి ట్రై చేసేద్దాం అని కాకుండా శ్రద్ధగా రోజులో అలవాటుగా మార్చుకుని ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఫలితం చక్కగా ఉంటుంది.
నిమ్మ నీరు..
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీరాన్ని Detoxification చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీలకర్ర నీరు..
జీలకర్ర గింజలు వాటి జీవక్రియను పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఒక టీస్పూన్ జీలకర్రను నీటిలో మరిగించి, వడకట్టి త్రాగాలి. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మెంతి నీరు..
మెంతులు ఆకలిని నియంత్రించడంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
ఇది కూడా చదవండి: ఇళ్ల పక్కనో.. చెత్త కుప్పల్లోనో పెరిగే ఈ మొక్కల్ని గమనించారా..? వీటితో ఎన్ని వ్యాధులకు చెక్ పెట్టొచ్చంటే..!
అల్లం నీరు..
అల్లం జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. అల్లం వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట కొవ్వు తగ్గుతుంది.
పుదీనా నీరు..
ఒక కప్పు నీటిలో దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను తాగడం వల్ల రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా జీర్ణక్రియ, హైడ్రేషన్‌లో కూడా సహాయపడుతుంది.
దాల్చిన చెక్క నీరు..
దాల్చిన చెక్కలో పీచు ఎక్కువగా ఉంటుంది. దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది. రోజూ ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది.