మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-09-09T23:38:21+05:30 IST

తెల్లగా, ఎత్తుగా ఉండే ఈ తెల్లని కొంగను ఆస్ట్రేలియన్‌ పెలికాన్‌ అని పిలుస్తారు. ఆస్ర్టేలియా, న్యూగినియా,ఫిజీ,న్యూజిలాండ్‌లోని సముద్రతీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి...

మీకు తెలుసా?

తెల్లగా, ఎత్తుగా ఉండే ఈ తెల్లని కొంగను ఆస్ట్రేలియన్‌ పెలికాన్‌ అని పిలుస్తారు. ఆస్ర్టేలియా, న్యూగినియా, ఫిజీ, న్యూజిలాండ్‌లోని సముద్రతీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే వీటి ముఖ్యమైన ఆహారం చేపలే. చేపలను రెండు, మూడు కేజీల వరకూ సులువుగా తింటాయివి. కొన్ని సరస్సులు, కాలువల దగ్గర కూడా నివసిస్తాయి. ఇకపోతే డచ్‌ పక్షి ప్రేమికుడు 1824లో ఈ పక్షి గురించి రాశాడు.

ఇవి నాలుగు నుంచి తొమ్మిది కేజీల మధ్యలో ఉంటాయి. రెక్కలపై నలుపు, తెలుపు రంగులుంటాయి. ముక్కు మాత్రం పింక్‌ కలర్‌లో ఉంటుంది.

గొంతు కింద సంచిలాంటి నిర్మాణం ఉంటుంది.

వీటి ఎముకలు చాలా తేలికగా ఉంటాయి. అందుకే సులువుగా ఎగురుతాయి. ఇకపోతే గంటకు 52 కి.మీ. వేగంతో గాలిలో దూసుకుపోతాయి.

ఇవి పగలు, రాత్రి అని తేడా లేకుండా తిరుగుతుంటాయి. గుంపుగా ఉండటానికి ఇష్టపడతాయి. ఒకేచోట కాలనీలుగా నివాసాలను ఏర్పరచుకుంటాయి. ఒక్కోసారి సముద్ర తీరాల్లో నాలుగైదువేల పక్షులు ఒకే చోట ఉంటాయి.

ఇవి ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లటానికి ఇష్టపడవు.

వానపడేప్పుడు ముక్కు కింద సంచిలా ఉండే నిర్మాణంతో వాననీళ్లను పట్టుకుని తాగుతాయి. ఇంకో విషయం ఏంటంటే దీని ముక్కు కింద ఉండే సంచిలో కనీసం తొమ్మిది లీటర్లు నీరు పడుతుంది.

ఒకటి లేదా మూడు గుడ్లు మాత్రమే పెడతాయి. 32 రోజుల నుంచి 37 రోజులు పొదుగుతాయి.

వీటి జీవనకాలం పదిహేనేళ్ల నుంచి ఇరవై ఏళ్ల మధ్యలో ఉంటుంది.

Updated Date - 2023-09-09T23:38:40+05:30 IST