Costly Maid: ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ.. రోజుకి రూ.2 లక్షలు సంపాదిస్తున్న యువతి.. అయితే, ఇక్కడ ఆమె ఫాలో అవుతున్న పద్దతి కొంచెం..

ABN , First Publish Date - 2023-03-11T10:06:36+05:30 IST

సాధారణంగా ఇళ్లలో పనిమనిషిగా (Maid) చేసేవారికి జీతం ఎంత ఉంటుందంటే..

Costly Maid: ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ.. రోజుకి రూ.2 లక్షలు సంపాదిస్తున్న యువతి.. అయితే, ఇక్కడ ఆమె ఫాలో అవుతున్న పద్దతి కొంచెం..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఇళ్లలో పనిమనిషిగా (Maid) చేసేవారికి జీతం ఎంత ఉంటుందంటే.. కొంచెం ఉన్నోళ్ల ఇండ్లలోనైతే ఓ రూ.15,000 లోపు. అదే మధ్యతరగతి వారిళ్లలోనైతే వెయ్యి నుంచి 5వేల వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఈ యువతి మాత్రం ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ఆమెకు ఓ స్నేహితురాలు చెప్పిన ఒక ఐడియాతో పనిమనిషిగా చేస్తూనే రోజుకి సుమారు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తోంది. ఇంకా చెప్పాలంటే గంటకు 300 డాలర్లు వసూలు చేస్తోంది. అవును మీరు విన్నది నిజమే. కానీ, మన దగ్గర కాదులేండి. అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida). ఇంతకీ ఆమె ఇంత ఎలా సంపాదిస్తుంది? అసలు అవతలి వారు ఆమెకు ఎందుకు ఇంత భారీ మొత్తం చెల్లిస్తున్నారు? ఆమె వర్క్‌లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? అనే ప్రశ్నలు రావడం కామన్. ఈ విషయాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే..

ఆమె పేరు సామీ (Sammie). ఫ్లోరిడాలోని టంపాలో నివసిస్తున్న సామీకి ఒకరోజు ఆమె స్నేహితురాలు ఒకరు.. కేవలం ఇళ్లలో పనిచేసే లక్షలు కూడబెట్టే ఓ అద్భుతమైన ఐడియా చెప్పింది. మొదట ఆ ఐడియా విన్న సామీకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ, ఆ తర్వాత అదే ఐడియాను ఫాలో అయింది. అంతే.. ఆ ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది. మొదట స్నేహితురాలి ఐడియాతో సామీ ఓ యాడ్ ఇచ్చింది. ఇంకేముంది.. అలా యాడ్ ఇవ్వడమే లేటు.. ఆమె మొబైల్ నంబర్‌కు కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలోంచి 5 హైయ్యేస్ట్ పేయిడ్ ఇళ్లను సెలక్ట్ చేసుకుంది. అలా ఆ ఐదు ఇళ్లను శుభ్రం చేస్తూ ఇప్పుడు డైలీ 2,230 డాలర్లు (దాదాపు రూ.1.8 లక్షలు) సంపాదిస్తుంది. ఇంతకీ ఆమె ఆ ఇళ్లలో ఎలా పని చేస్తుందో చెప్పలేదు కదూ. ఆమె ఇళ్లలో పనికి వెళ్లేటప్పుడు టాప్‌లెస్‌గా (అర్థనగ్నంగా) వెళ్తుందట.

ఇది కూడా చదవండి: భారతీయ వంటకాలు అస్సలు బోర్ కొట్టవు.. ఇక్కడ ఒకో రోజు ఒకో అద్భుతమైన అనుభవం..

ఇలా ఆమె టాప్‌లెస్ మెయిడ్‌గా (Topless Maid) మారి భారీగా డబ్బులు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని టిక్‌టాక్‌ వీడియోలో (TikTok Videos) స్వయంగా సామీనే వెల్లడించింది. దాంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇకపోతే ఆమె తన సంపాదనలో నెలకు రూ.60 వేలు ఇచ్చి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకుంది. ఈమె అర్థనగ్నంగా ఇళ్లల్లోకి వెళ్లి పనిచేస్తుంది కాబట్టి ఇంట్లో వారు టెంప్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆమె ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకుంది. కాగా, అగ్రరాజ్యంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడ నెలకు లక్ష రూపాయలు సంపాదించిన సరిపోవు. అందుకే ఇలా విచిత్రమైన ఉద్యోగాలు చేయడానికి కూడా చాలామంది రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో సామీ కూడా ఒకరు. అయితే ఆమె ఐడియాను కొందరు మెచ్చుకుంటుంటే మరి కొందరు ఇదేం పాడు పని అని తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు మాత్రం 'సెక్యూరిటీ గార్డ్ పని బాగుంది.. హాయిగా బయట కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నాడని' కామెంట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి అనంతలోకాలకు..!

Updated Date - 2023-03-11T11:22:33+05:30 IST