ATA: కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు 'ఆటా' అశ్రు నివాళి

ABN , First Publish Date - 2023-02-04T07:59:03+05:30 IST

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నివాళి తెలిపింది.

ATA: కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు 'ఆటా' అశ్రు నివాళి

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నివాళి తెలిపింది. చలనచిత్ర సాగర సంఘమ గర్భంలో దొరికిన స్వాతి ముత్యం... సాంఘిక సమస్యలను తన చిత్రాల ద్వారా ప్రస్తావిస్తూ సమాజ మార్పుకు యత్నించిన శుభ సంకల్పి... భారతీయ సినీ పరిశ్రమపై ప్రసరించిన స్వాతి కిరణం... సినీ కళామ తల్లి మెడలో(శంకరా) ఆభరణం... తెలుగు చిత్ర రంగం పై కురిసిన సిరి వెన్నెల... భారతీయ కళలను బ్రతికించుటకు నిరంతరం తపస్సు చేసిన కళాతపస్వి... మన కాశీనాధుని విశ్వనాథుడు లేరని చెప్పడానికి హృదయం ద్రవిస్తుంది. ఆ మహా దర్శకుని ఆత్మకు శాంతి చేకురాలని సమస్త దేవుళ్ళను ప్రార్ధిస్తూ... అమెరికా తెలుగు సంఘం శ్రద్ధాంజలి ఘటిస్తుంది అని పేర్కొంది.

Vishwanath.jpg

Updated Date - 2023-02-04T07:59:55+05:30 IST

News Hub