Indian Community: కువైత్‌లోని భారతీయులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్‌ బంపరాఫర్.. అనేక ఉత్పత్తులపై మనోళ్లకు ప్రత్యేకమైన తగ్గింపు

ABN , First Publish Date - 2023-04-28T08:31:24+05:30 IST

కువైత్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ యురేకా (Eureka) భారతీయ కమ్యూనిటీకి (Indian Community) బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Indian Community: కువైత్‌లోని భారతీయులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్‌ బంపరాఫర్.. అనేక ఉత్పత్తులపై మనోళ్లకు ప్రత్యేకమైన తగ్గింపు

కువైత్ సిటీ: కువైత్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ యురేకా (Eureka) భారతీయ కమ్యూనిటీకి (Indian Community) బంపర్ ఆఫర్ ప్రకటించింది. అనేక విస్తృత శ్రేణి ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లలో భారతీయులకు ప్రత్యేకమైన తగ్గింపులను (Exclusive Discount) అందుబాటులో ఉంచిన్నట్లు వెల్లడించింది. అత్యుత్తమమైన, అతిపెద్ద కలెక్షన్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. భారతీయ కమ్యూనిటీకి వారి షోరూమ్‌లలో ఎంపిక చేసిన అనేక ఉత్పత్తులపై ప్రత్యేకమైన తగ్గింపు ధరలకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా యురేకా పేర్కొంది. ఇక ఈ ప్రత్యేక తగ్గింపులు ఇంటర్నెట్ రౌటర్‌ల నుండి డెస్క్‌జెట్ ప్రింటర్ల వరకు, హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌ల నుండి ట్రిమ్మర్‌ల వరకు, ఎగ్ బాయిలర్‌ల నుండి గ్లాస్ కెటిల్స్ వరకు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అందుబాటులో ఉన్నాయట. భారతీయ సమాజం ఇష్టపడే అనేక ఉత్పత్తులు ఈ ఆఫర్‌లో ప్రత్యేకంగా భారతీయ కమ్యూనిటీ (Indian Community) కోసం అందుబాటులో ఉన్నాయి.

ఇక ఆఫర్‌లు అన్ని యురేకా షోరూమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ క్యాష్ కౌంటర్‌లో వారి సివిల్ ఐడీని (Civil ID) చూపించి, భారతీయ సమాజం ఈ ప్రత్యేకమైన తగ్గింపు ధరను అడగాలి. కాగా, భారతీయ కమ్యూనిటీ కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్‌లు అన్ని యురేకా షోరూమ్‌లలో మే 14 2023 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక కువైత్‌లో యురేకాకు మొత్తం ఆరు షోరూమ్‌లు ఉన్నాయి. హవాలీ, సాల్మియా, అల్ రాయ్, ఫర్వానియా, అల్ జహ్రా, ఫహాహీల్‌లలో ఈ ఆరు షోరూమ్‌లు ఉన్నాయి. ఈ ఆరు షోరూమ్‌లలో భారత ప్రవాసులు (Indian Expats) తమకు కావాల్సిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను యురేకాలో అతి తక్కువ ధరకు పొందవచ్చు. దీనికి కేవలం సివిల్ ఐడీ చూపిస్తే సరిపోతుంది.

Diwali Holiday: ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలీడే.. న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా!


Updated Date - 2023-04-28T08:31:24+05:30 IST

News Hub