Kuwait: కువైత్ లేబర్ మార్కెట్‌లో భారతీయులదే హవా.. మనోళ్ల వాటా ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ABN , First Publish Date - 2023-02-14T08:39:54+05:30 IST
కువైత్ లేబర్ మార్కెట్‌లో (Kuwait Labor Market ) భారతీయ కార్మికుల (Indian Workers) హవా కొనసాగుతోంది.
కువైత్ సిటీ: కువైత్ లేబర్ మార్కెట్‌లో (Kuwait Labor Market ) భారతీయ కార్మికుల (Indian Workers) హవా కొనసాగుతోంది. మొత్తం కార్మికులలో మనోళ్ల వాటానే దాదాపు 25శాతం వరకు ఉంది. తాజాగా వెలువడిన సెంట్రల్ డిపార్ట్‌మెంట్ గణాంకాల (Central Department of Statistics) ప్రకారం.. ఆ దేశ లేబర్ మార్కెట్‌లో భారత్, ఈజిప్ట్ కార్మికుల వాటానే దాదాపు 50శాతం ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో భారతీయ కార్మికులు24.1శాతం ఉంటే.. ఈజిప్టియన్లు 23.6శాతం ఉన్నారు. ఇక సంఖ్య పరంగా చూసుకుంటే 4,76,335 మందితో భారత్ టాప్‌లో ఉంది. 4,67,074 మంది వర్కర్లతో ఈజిప్ట్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక కువైత్ 4,38,803 (22.2శాతం) మందితో మూడో స్థానంలో ఉంది. మరో 22శాతం వర్క్‌ఫోర్స్‌ను మరో ఏడు దేశాలు పంచుకుంటున్నాయి. వాటిలో బంగ్లాదేశ్ (1,58,911), పాకిస్థాన్ (68,755), ఫిలిప్పీన్స్ (65,260), సిరియా (63,680), నేపాల్ (56,489), జోర్డాన్ (26,856 ), లెబనాన్ (20,271) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో కొనసాగుతున్నాయి. మిగిలిన 6.8శాతం మంది (1,34,588) ఇతర వివిధ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నారు. మొత్తంగా పురుష కార్మికులు (కువైటీలు, ప్రవాసులు) 15,43,584 మంది ఉంటే.. మహిళా వర్కర్లు (కువైటీలు, ప్రవాసులు) 15,43,584 ఉన్నారు.
ఇది కూడా చదవండి: కువైత్‌లో నెల రోజుల క్రితం కనిపించకుండాపోయిన భారతీయుడు.. చివరికి విషాదాంతం..!