YCP Minister: స్థానిక సంస్థల ఓటర్లకు మంత్రి ధర్మాన వార్నింగ్
ABN , First Publish Date - 2023-02-28T23:29:35+05:30 IST
శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
శ్రీకాకుళం: స్థానిక సంస్థల ఓటర్ల (local bodies voters)కు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Andhra Pradesh Minister Dharmana Prasad Rao) వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు ఓటు వేయక పోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎవరు ఎవరికి ఓటు వేశారో పక్కా సమాచారం తమకు వస్తుందని ధర్మాన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైతే విశాఖపట్నం రాజధానికి (Visakhapatnam capital) వ్యతిరేకంగా తీర్పు వచ్చిందంటారని ధర్మాన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాపులకు అన్యాయం జరిగింది అనటం కరెక్ట్ కాదని ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తూర్పు కాపులకు సీటు ఇవ్వలేదన్న కోసంతో కాపు వర్గానికి చెందిన ఒకరు పోటీకి నిలబడ్డారు. దీంతో మంత్రి ధర్మానలో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయినా మంత్రి ధర్మాన వైసీపీ అభ్యర్థిని కాదని ఇతరులకు ఓటు వేస్తే సహించమని హెచ్చరించారు. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. కార్నర్ మీటింగ్‌లో ఉద్రిక్తత
వలంటీర్ వ్యవస్థపై ఏపీ హైకోర్టు సీరియస్.. అంత నమ్మకం లేదా అంటూ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
మేము జగన్‌పై ఉద్యమానికి వెళ్తున్నాం
జగన్‌తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా?: సోమిరెడ్డి
ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు