Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

ABN , First Publish Date - 2023-04-01T18:14:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..?

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..? కేబినెట్ నుంచి నలుగురు మంత్రులు (4 AP Ministers) ఔట్ కానున్నారా..? అంటే ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ఇప్పుడున్న మంత్రుల రియాక్షన్‌ను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు కలిసినా మంత్రులు మారుతున్నారంటగా..? అనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ నలుగురు మంత్రులు ఎవరు..? ఎందుకు వారిని కేబినెట్ నుంచి జగన్ తీసేస్తున్నారు..? ఈ నలుగురి స్థానంలో మంత్రులుగా చోటు దక్కించుకునేదెవరు..? ఈసారి.. అంటే జగన్ 3.0 టీమ్‌లోకి మొదటిసారి జగన్ కేబినెట్‌లో పనిచేసిన ఇద్దరు సీనియర్ నేతలను తీసుకుంటున్నారా..? అసలు పాత మంత్రులను మళ్లీ తీసుకోవాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారు..? ఈసారి మండలి నుంచి మంత్రివర్గంలోకి వెళ్లేదెవరు..? అసలు ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ చేయడానికి జగన్ ఎందుకు సాహసిస్తున్నారు..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

YS-Jagan.jpg

అసలేందుకీ విస్తరణ..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (2024 Elections) ఏడాది మాత్రమే సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏయే నియోజకవర్గాల నుంచి ఎవర్ని బరిలోకి దింపాలి..? అసలు గెలుపు గుర్రాలెవరు..? ఏయే జిల్లాలో పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయ్..? అనే నివేదికలు తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యాయ్. అయితే సీఎం జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేసి.. ఆ తర్వాత సిట్టింగ్‌లలో ఎవరికి సీటివ్వాలి..? ఎవర్ని పక్కనెట్టాలి..? ఏయే నియోజకవర్గాల్లో ఎవర్ని మార్చాలి..? అని అందరి కంటే ముందుగానే వైసీపీ అధిష్ఠానం లెక్కలేసుకుంటోందట. వీటన్నింటికీ ముహూర్తం ఏప్రిల్-3న (April-3) ఖరారు కానుందనే వార్తలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. వాస్తవానికి డిసెంబర్‌లో జరిగిన ఎమ్మెల్యేల కీలక సమావేశంలో ఏప్రిల్-3న ఎమ్మెల్యేల సీట్లు ఎవరికివ్వాలనేదానిపై క్లారిటీ ఇచ్చేస్తామని అధికారికంగానే ప్రకటన చేశారు. అందుకే ఎల్లుండి జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో ఎమ్మెల్యేల వ్యవహారంపై లెక్క తేలిపోనుంది. ఇక మిగిలింది మంత్రివర్గ విస్తరణే.. దీనిపై కూడా అదేరోజు జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేయనున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే.. ఎన్నికలు ఏడాది మాత్రమే ఉండటంతో దీన్ని పీక్ టైమ్‌గా జగన్ భావిస్తున్నారట. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ముగ్గురు, నలుగురు మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని వారిపైన జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. పనితీరు సరిగ్గా లేకపోయినా, శాఖకు న్యాయం చేయలేకపోయినా కచ్చితంగా తొలగింపులు ఉంటాయని ప్రతిసారి జగన్ ఖరాకండిగానే తేల్చి చెప్పేస్తుంటారు. అందుకే ఇప్పుడు నలుగురు మంత్రులను తప్పించి.. వారి స్థానంలో ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు కొత్తవారిని తీసుకునే యోచనలో జగన్ ఉన్నారట.

Jagan Cabinet.jpg

కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు..!?

జగన్ తన కేబినెట్‌నుంచి ఎవర్ని తప్పిస్తారనేది ఫైనల్ కాలేదు కానీ.. ఇదిగో ఈ మంత్రులే ఔటయ్యేదని కొందరి పేర్లతో కూడిన జాబితా మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాలో రాయలసీమకు చెందిన నారాయణ స్వామి (Narayana Swamy), గుమ్మనూరు జయరాం (Gummanuru Jayaram) .. గోదావరి జిల్లాలకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina Venu Gopala Krishna) , దాడిశెట్టి రాజా (Dadisetti Raja) , పినిపే విశ్వరూప్ (Pinipe Viswarup) , తానేటి వనిత (Taneti Vanitha).. ఉత్తరాంధ్రకు చెందిన సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) వంటి వారు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో నలుగుర్ని మాత్రమే తొలగిస్తారని మాత్రం వైసీపీ శ్రేణులే (YSRCP Cadre) మాట్లాడుకుంటున్నాయి. ఇంతకీ ఆ నలుగురు ఎవరో అని మంత్రుల్లో టెన్షన్ మొదలైందట. మంత్రివర్గ విస్తరణ అనేసరికి ఆశావహులు, గతంలో చివరి నిమిషంలో పదవి మిస్సయిన నేతలంతా ఎంతో ఆశగా.. ఈసారైనా అదృష్టం తలుపు తడుతుందేమో అని ఎదురుచూస్తున్నారట. మరోవైపు.. ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్న జగన్.. ఎమ్మెల్యేల సమావేశంలోపే మిగిలిన ఆ ఇద్దర్ని కూడా పిలిపించి మాట్లాడుతారని సమాచారం. మరీ ముఖ్యంగా.. హోం మంత్రిని (Home Minister) కూడా మారుస్తారని వార్తలు రావడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. ఇప్పటికే రెండుసార్లు మహిళను హోం శాఖ పీఠంపై కూర్చోబెట్టిన జగన్.. ఈసారి ఇందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఎన్నికల సీజన్ గనుక హోం శాఖను సీనియర్ నేతకు.. అది కూడా మగవారికి ఇవ్వాలని సీఎం మనసులోని మాటంటూ వైసీపీలో చర్చ నడుస్తోందట. మరి ఆ పదవి దక్కించుకునేదెవరో.. ఏంటో చూడాలి మరి.

Jagan Cabinet 2.jpg

కేబినెట్‌లోకి వచ్చేదెవరు..!?

ఇక కేబినెట్‌లోకి ఎవరొస్తున్నారనే దానిపై కూడా గత రెండు, మూడ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొన్ని పేర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య కార్యకర్తలే కొన్ని పేర్లను షేర్ చేస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. కేబినెట్‌లోకి వచ్చేవారిలో మాజీ మంత్రులు కొడాలి నాని (Kodali Nani), బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy).. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) , ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Thammineni Seetharam) పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శాసన మండలి (Legislative Council) నుంచి కూడా ఒకర్ని తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. మండలి నుంచి మర్రి రాజశేఖర్‌ (Marri Rajasekhar), తోట త్రిమూర్తులు (Thota Trimurthulu), కవురు శ్రీనివాస్‌లలో (Kavuru Srinivas) ఒకర్ని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Balineni-and-kodali.jpg

ఊహించని విధంగా ఉంటుందా..!?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేబినెట్‌లోకి తీసుకునే వారి జాబితాలో మర్రి రాజశేఖర్ పేరు రావడం. ఎందుకంటే ఇప్పటికే చిలకలూరిపేట (Chilakaluripet) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజినికి (Vidadala Rajini) ఇప్పటికే జగన్ మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు అదే నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ పేరు ప్రచారంలోకి రావడంతో ఇందులో నిజమెంతో అని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు ఆలోచనలో పడ్డారట. వాస్తవానికి వైఎస్ ఫ్యామిలీకి (YS Family) మర్రి రాజశేఖర్ నమ్మినబంటుగా ఉంటూ వస్తున్నారు. వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగన్ వెంటే మర్రి నడిచారు. నాటి నుంచి నేటి వరకూ జగన్‌తోనే ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో చివరి నిమిషంలో మర్రిని కాదని విడదల రజినికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఆయన సీనియార్టీకి తగ్గట్టుగానే ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారని వైసీపీ చెప్పుకుంటూ ఉంటుంది. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు మంత్రులను చూసిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పుకోవాలి. అయితే.. ఇప్పుడు ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి మరి.

YSRCP-MLAS-Full.jpg

ఇన్ని ట్విస్ట్‌లు ఉంటాయా..?

ఇదిలా ఉంటే.. ఇద్దరు పాత మంత్రులను తీసుకుంటారని వార్తలు రావడం మామూలు విషయం అయితే కాదు. అసలు ఎందుకు అప్పట్లో వారిని తొలగించారు..? ఇప్పుడు మళ్లీ వారినే ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నారు..? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అయితే.. వైసీపీ నుంచి వస్తున్న సమాచారం ఏమిటంటే.. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కొడాలి నాని, బాలినేని (Kodali Nani, Balineni) ముందు వరుసలో ఉంటారని.. వీళ్లయితేనే సరైన కౌంటర్లు ఇస్తారని జగన్ భావిస్తున్నారట. అందుకే ఇదివరకే మంత్రివర్గంలో చోటు కల్పించినప్పటికీ.. ఎన్నికల టైమ్‌ కావడంతో ఇప్పుడు కచ్చితంగా మరోసారి కేబినెట్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే.. హోం మంత్రిని కూడా తొలగిస్తారని.. అది కూడా ఈసారి మహిళకు కాకుండా మగవారికి ఆ శాఖ కేటాయిస్తారని వార్తలు రావడం.. ఇవన్నీ నిజంగా జరిగితే మాత్రం పెద్ద ట్విస్ట్‌లే అని చెప్పుకోవచ్చు.

మొత్తానికి చూస్తే.. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపైనే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. వైసీపీ వర్గాల్లో, సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న మార్పులు, చేర్పుల జాబితాల వార్తల్లో నిజానిజాలెంత..? ఒకవేళ ఇదే నిజమైతే కేబినెట్ నుంచి ఔటయ్యేది ఎవరో..? మంత్రివర్గంలో చోటు దక్కించుకునేదెవరో..? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఏపీ రాజకీయాలు (AP Politics) , మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మొత్తం వ్యవహారం ఏప్రిల్-3 చుట్టూనే తిరుగుతోంది. ఆ రోజు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి

******************************

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

******************************

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

******************************

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

******************************

YS Jagan House : బాబోయ్.. పేరుకేమో రూపాయి సీఎం వైఎస్ జగన్.. ఈ విషయంగానీ మీకు తెలిసిందో..!

******************************
YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

******************************

Updated Date - 2023-04-01T18:28:41+05:30 IST