Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?
ABN , First Publish Date - 2023-02-25T19:12:51+05:30 IST
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఒకరు. జబర్ధస్త్ (Jabardasth) షో ద్వారానే కాకుండా
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఒకరు. జబర్ధస్త్ (Jabardasth) షో ద్వారానే కాకుండా సినిమాలలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ (Rashmi), రీసెంట్‌గా జరిగిన.. వీధి కుక్కల (Stray Dogs) ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. చిన్న బాలుడికి జరిగిన ఘటనపై ఆమె కూడా విచారం వ్యక్తం చేసింది కానీ.. వీధి కుక్కలకు కూడా ఏదైనా వసతి కల్పిస్తే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేలా కొన్ని ట్వీట్స్ చేసింది. ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు చాలా మంది ఆగ్రహించారు. ఆమెను తిడుతూ, బెదిరిస్తూ.. కొన్ని కామెంట్స్ చేశారు. పర్సనల్‌గా కూడా తనకి మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నట్లుగా తాజాగా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ మెసేజ్ చూస్తే తెలుస్తుంది.
రష్మీ షేర్ చేసిన మెసేజ్‌లో.. ‘‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టిదానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతాయా? యాసిడ్ (Acid) పోస్తా.. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు. అన్నీ మూసుకుని వుండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావ్’’ అంటూ రష్మీని ఘాటుగా హెచ్చరిస్తున్న మెసేజ్ ఉంది. (Rashmi Gautam Tweet)
ఈ మెసేజ్ షేర్ చేసిన రష్మీ.. ఈ అకౌంట్ ఎవరిదో తెలియదు కానీ.. వీరికి కొన్నాళ్ల క్రితం.. నా వయసు, పెళ్లితో ఇబ్బంది. ఇప్పుడు ఏకంగా చేతబడి (Black Magic) చేయిస్తారట.. నాపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నారు. మరి ఇలాంటి వారిపై నేను ఫిర్యాదు చేయాలా? వద్దా? అని ప్రశ్నించింది. ఈ ట్వీట్‌కు కొందరు నెటిజన్లు ‘లైట్ తీసుకో’ అని అంటుంటే.., కొందరు మాత్రం ‘ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే’ అంటూ రష్మీకి కామెంట్ల రూపంలో సలహాలు ఇస్తున్నారు. మరి రష్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. (Anchor Rashmi Gautam)
ఇవి కూడా చదవండి
*********************************