Bank holidays in March 2023: హోలీ, ఉగాది, శ్రీరామనవమి పండుగలన్నీ ఒక్క నెలలోనే.. మార్చిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..
ABN , First Publish Date - 2023-02-27T15:43:32+05:30 IST
బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులున్నాయో చూస్తే..
ఫిబ్రవరి ముగింపుకు వచ్చేసింది. మార్చినెల మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ దారిలో ఉంది. నెలలు మారినా పనులు చేసుకోవడం మాత్రం మనకు కామన్. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల విషయంలో అలెర్ట్ గా ఉండాలి. అన్ని కార్యాలయాలకు సెలవులున్నట్టే బ్యాంకులకు కూడా సెలవులుంటాయి. ఈ సెలవుల గురించి తెలుసుకుంటే మనం ఎప్పుడు వెళ్ళచ్చు ఎప్పుడు పనులు చేసుకోవచ్చు అనేది సులువు అవుతుంది. బ్యాంకులకు మార్చి నెలలో ఏకంగా 12రోజుల సెలవులున్నాయి. అంటే 31రోజులలో 12సెలవులు తీసేస్తే 19రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఇంతకూ బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులున్నాయో చూస్తే..
మార్చి 3 : మార్చి 3వ తేదీన చప్తార్ కుట్ సందర్భంగా సెలవు దినం.
మార్చి 7: మార్చ్ 7వ తేదీన హోలీ పండుగ సందర్భంగా సెలవు దినం ఉంది.
మార్చి 8: మార్చి 8వ తేదీన హోలీ పండుగ రెండవ రోజు
మార్చి 9: మార్చి 9వ తేదీ హోలీ పండుగ సెలవు దినం.
మార్చి 22: మార్చి 22 వతేదీన ఉగాది పండుగ.
మార్చి 30: మార్చి 30వ తేదీన శ్రీరామ నవమి పండుగ.
Read also: నువ్వేమీ సాధించలేవని ఫ్రెండ్స్ హేళన చేశారు.. అందరి నోళ్ళు ఎలా మూయించిందంటే..
వీటి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవు దినాలు రాష్ట్రాలను బట్టి మారతాయి కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ఇన్నిరోజులు సెలవు లేవు. కేవలం హోలీ పండుగ సందర్భంగా 7వ తేదీ, ఉగాది పండుగ సందర్భంగా 22వ తేదీ, శ్రీరామ నవమి సందర్భంగా 30 వతేదీ మొత్తం మూడురోజులు పండుగ సెలవులు ఉన్నాయి. వీటితో పాటు బ్యాంకులకు ఆదివారాలు, రెండవ నాలుగవ శనివారాలు సెలవు ఉంటుంది. మార్చి నెలలో ఆదివారాలు, రెండవ నాలుగవ శనివారాలు ఏయే తేదీల్లో వచ్చాయో చూస్తే..
మార్చి 5, 2023: ఆదివారం
మార్చి 11, 2023: శనివారం
మార్చి 12, 2023: ఆదివారం
మార్చి 19, 2023: ఆదివారం
మార్చి 25, 2023: శనివారం
మార్చి 26, 2023: ఆదివారం
మొత్తం 9రోజులు సెలవు దినాలున్నాయి తెలుగు రాష్ట్రాలలో ఉన్న బ్యాంకులకు. వీటిని అనుసరించి పనులు చక్కబెట్టుకోడానికి ప్లాన్ చేసుకోండి.