Mother Video: తల్లి ప్రేమ రేంజ్ అదీ.. బిడ్డను కాపాడడం కోసం రక్తమోడిన అమ్మ.. వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:35 PM
బిడ్డ కోసం ఏం చేయడానికైనా తల్లి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా రష్యాలో ఓ మహిళ చేసిన పని ఎంతో మందిని కదిలిస్తోంది.

ఈ ప్రపంచంలో తల్లి (Mother) ప్రేమను మించినది మరొకటి లేదు. బిడ్డ కోసం ఏం చేయడానికైనా తల్లి సిద్ధపడుతుంది. బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా రష్యా (Russia)లో ఓ మహిళ చేసిన పని ఎంతో మందిని కదిలిస్తోంది. ఆమె తన బిడ్డకు రక్షణ కవచంలా నిలిచి పోరాడింది. తను రక్తమోడుతున్నా బిడ్డ ఒంటిపై చిన్న గీత కూడా లేకుండా కాపాడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@ManojSh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో చిత్రీకరించారు. రోట్‌వీలర్ కుక్క (Rottweiler dog) చాలా ప్రమాదకరమైనది. చిన్న పిల్లలపై దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు. చాలా దేశాల్లో రోట్‌వీలర్ కుక్కలను పెంచుకోవడాన్ని నిషేధించారు. అయితే రష్యాలో ఓ ఐదేళ్ల బాలుడిపై దాడి చేసేందుక రోట్‌వీలర్ కుక్క ప్రయత్నించింది. అయితే ఆ కుక్కకు ఆ బాలుడి తల్లి ఎదురు నిలిచింది. తన బిడ్డకు రక్షక కవచంలా నిలిచి ఆ కుక్కకు దొరక్కుండా చేసింది. దీంతో ఆ కుక్క మహిళపై దాడి చేసింది.
కుక్క కాటు వల్ల ఆ మహిళకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అయినా ఆ మహిళ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన బిడ్డపై చిన్న గీత కూడా పడనివ్వలేదు. ఆమె అరుపులు విని పక్కనున్న వాళ్లు అక్కడకు వచ్చారు. అక్కడకు వెళ్లిన వారిపై కూడా దాడి చేసేందుకు ఆ కుక్క ప్రయత్నిస్తోంది. ఈ ఘటన మొత్తాన్ని కారులో కూర్చున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..