Funny Viral Video: వీళ్ల తెలివి తెల్లారినట్టే ఉంది.. యూట్యూబ్ చూసి ఇల్లు కడితే ఇలాగే ఉంటుంది
ABN , Publish Date - Feb 28 , 2025 | 02:58 PM
ఇంటి ప్లాన్ గీసే ఇంజినీర్‌కే కాదు, ఇంటి పని చేసే మేస్త్రి, అతడితో పాటు పని చేసేవారికి కూడా ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. అలా అయితేనే ఇల్లు అన్ని హంగులు, సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా తయారవుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది తమకు నైపుణ్యం లేని పనులను కూడా యూట్యూబ్ సహాయంతో చేసెయ్యాలని చూస్తున్నారు.

ఇల్లు (House) కట్టడం అనేది ఎవరు పడితే వారు చేసే పని కాదు. ఇల్లు కట్టాలంటే కచ్చితంగా నైపుణ్యం ఉండాల్సిందే. ఇంటి ప్లాన్ గీసే ఇంజినీర్‌కే కాదు, ఇంటి పని చేసే మేస్త్రి, అతడితో పాటు పని చేసేవారికి కూడా ఎంతో కొంత నైపుణ్యం ఉండాలి. అలా అయితేనే ఇల్లు అన్ని హంగులు, సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా తయారవుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది తమకు నైపుణ్యం లేని పనులను కూడా యూట్యూబ్ సహాయంతో చేసెయ్యాలని చూస్తున్నారు (Constructing house). అలా చేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది (Viral Video).
agencyy.life అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందు కార్మికులు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. గదుల మధ్య గోడలను కడుతున్నారు. అయితే ఓ గదిని చాలా విచిత్రంగా కట్టారు. ఓ గదికి పూర్తిగా నాలుగు వైపులా గోడలు కట్టేశారు. తలుపు అమర్చుకోవాలనే ఆలోచన కూడా లేకుండా గది కట్టేశారు. ఓ వ్యక్తి వెళ్లి అడిగిన తర్వాతనే వారికి అసలు విషయం అర్థమైంది. ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వారి పనితనాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటివరకు దాదాపు కోటి మంది వీక్షించారు. 6.4 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది నిజమైన టీమ్ వర్క్``, ``అది సీక్రెట్ రూమ్. దానికి తలుపు ఉండదు``, ``ఆ గదికి తలుపు పై నుంచి వస్తుంది`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..