Changes in Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు... 10 పాయిట్లలో పూర్తి వివరాలు...

ABN , First Publish Date - 2023-03-29T11:47:34+05:30 IST

Changes in Income Tax Rules: 2023, ఏప్రిల్ 1 నుండి, కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారనుంది. అంటే పన్ను చెల్లింపుదారులు(Taxpayers) తమకు ఇష్టమున్న పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

Changes in Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు... 10 పాయిట్లలో పూర్తి వివరాలు...

1) కొత్తగా డిఫాల్ట్ విధానం

Changes in Income Tax Rules: 2023, ఏప్రిల్ 1 నుండి, కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారనుంది. అంటే పన్ను చెల్లింపుదారులు(Taxpayers) తమకు ఇష్టమున్న పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

2020-21 బడ్జెట్‌(Budget)లో ప్రభుత్వం ఐచ్ఛిక ఆదాయపు పన్ను విధానాన్ని తీసుకొచ్చింది, దీని కింద పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFలు) ఇంటి అద్దె భత్యం (HRA) వంటి నిర్దిష్ట మినహాయింపులు(Certain exceptions), తగ్గింపులను పొందకుంటే తక్కువ రేట్లకే వారికి పన్ను విధానం అమలువుతుంది. గృహ రుణం(Home loan)పై వడ్డీ, సెక్షన్ 80C, 80D, 80CCD కింద చేసిన పెట్టుబడులు మొదలైనవాటి కింద, ₹2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది.

2) పన్ను రాయితీ పరిమితి ₹7 లక్షలకు పెంచారు.

పన్ను రాయితీ(Tax rebate) పరిమితిని ₹ 5 లక్షల నుండి ₹ 7 లక్షలకు పెంచడం అంటే, ₹ 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ఏమీ పెట్టుబడి పెట్టనవసరం లేదు. పెట్టుబడి(Investment) పరిమాణంతో సంబంధం లేకుండా మొత్తం ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది.

3) ప్రామాణిక తగ్గింపు

పాత పన్ను విధానంలో ఉద్యోగులకు అందించిన ₹50,000 స్టాండర్డ్ డిడక్షన్‌(Standard Deduction)లో ఎలాంటి మార్పు లేదు. పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ₹15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రతి జీతం పొందిన వ్యక్తి ₹52,500 మేర ప్రయోజనం(purpose) పొందుతాడు.

4) ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు

కొత్త పన్ను రేట్లు

0-3 లక్షలు - నిల్

3-6 లక్షలు – 5%

6-9 లక్షలు- 10%

9-12 లక్షలు – 15%

12-15 లక్షలు - 20%

15 లక్షల పైన- 30%

5) LTA

ప్రభుత్వేతర ఉద్యోగులకు సెలవు ఎన్‌క్యాష్‌మెంట్‌(Leave encashment)కు కొంత పరిమితి వరకు మినహాయింపు ఉంది. ఈ పరిమితి 2002 నుండి ₹3 లక్షలుగా ఉంది. ఇప్పుడు ₹25 లక్షలకు పెంచారు.

6) ఈ మ్యూచువల్ ఫండ్‌లపై LTCG పన్ను ప్రయోజనం లేదు.

ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌(Debt Mutual Funds)లో పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను విధించనున్నారు.

7) మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు (MLDలు)

ఏప్రిల్ 1 తర్వాత మార్కెట్ లింక్డ్ డిబెంచర్స్ (ఎంఎల్‌డిలు)లో పెట్టుబడి స్వల్పకాలిక మూలధన ఆస్తులు(Capital assets)గా ఉంటుంది.

8) జీవిత బీమా పాలసీలు

వార్షిక ప్రీమియం ₹5 లక్షల కంటే ఎక్కువ జీవిత బీమా ప్రీమియం(Life insurance premium) ద్వారా వచ్చే ఆదాయంపై కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అంటే ఏప్రిల్ 1, 2023 నుండి పన్ను విధించనున్నారు.

9) సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్(Maximum Deposit) పరిమితి ₹15 లక్షల నుండి ₹30 లక్షలకు పెంచారు.

నెలవారీ ఆదాయ పథకం కోసం గరిష్ట డిపాజిట్ పరిమితి సింగిల్ ఖాతాల కోసం 4.5 లక్షల నుండి ₹ 9 లక్షలకు, జాయింట్ ఖాతాలకు ₹ 7.5 లక్షల నుండి ₹ 15 లక్షలకు పెంచారు.

10) మూలధన లాభాల పన్నును ఆకర్షించడానికి భౌతిక బంగారాన్ని ఇ-గోల్డ్ రసీదు(E-Gold Receipt)గా మార్చడం.

2023 బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుగా (EGR) మార్చినట్లయితే మూలధన లాభం పన్ను ఉండదని ఆర్థికమంత్రి సీతారామన్ తెలిపారు. ఇది 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వస్తుంది.

Updated Date - 2023-03-29T11:48:27+05:30 IST