Coconut: కొబ్బరికాయ @ రూ. 30 వేలు
ABN , First Publish Date - 2023-04-06T13:07:44+05:30 IST
కలశంపై ఉంచిన టెంకాయను ఓ భక్తుడు వేలంలో రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. తేని జిల్లా పోడిలో 200 ఏళ్ల ప్రాచీన

పెరంబూర్(చెన్నై): కలశంపై ఉంచిన టెంకాయను ఓ భక్తుడు వేలంలో రూ.30 వేలకు కొనుగోలు చేశాడు. తేని జిల్లా పోడిలో 200 ఏళ్ల ప్రాచీన బాలసుబ్రమణ్యస్వామి ఆలయం(Balasubramanyaswamy Temple)లో పంగుణి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం వల్లీదేవితో స్వామివారి తిరుకల్యాణం జరిగింది. ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. కల్యాణం సందర్భంగా వెండి కలశంపై ఉంచిన టెంకాయను శివాచార్యులు వేలం వేశారు. రూ.3 వేలతో ప్రారంభమైన వేలంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనగా, చివరకు ఓ భక్తుడు రూ.30 వేలకు దక్కించుకున్నాడు. కలశంపై ఉంచిన టెంకాయ దీర్ఘకాలం పాడవకుండా ఉంటుందని, అలాగే, ఇంట్లో ఉంచితే వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో శాంతి సంతోషాలు, అందరూ ఆరోగ్యంగా ఉంటారని భక్తుల నమ్మకం.