Coconut Game: ఇదేం ఆటరా నాయనా..? కొబ్బరి కాయలను పగలగొట్టేందుకు ఇంత రిస్క్ చేయాలా..?
ABN , First Publish Date - 2023-09-28T14:12:53+05:30 IST
రహదారి మద్యలో గుంపుగా నిలబడి మరీ ఈ కుర్రాళ్లు ఆడుతున్న ఆట చూస్తే విస్తుపోవడం ఖాయం.
ఈ ప్రపంచంలో ప్రాంతీయతను బట్టి వింత వింత ఆటలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయం పుట్టిస్తాయి. నవ్వు తెప్పిస్తూ భయం పుట్టించేవి కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది కుర్రాళ్లు కొబ్బరి కాయలు పగలగొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న విచిత్రం అంతా వాళ్లు కొబ్బరికాయలు పగలగొడుతున్న తీరే. అదొక ఆటలా సాగుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు.' వామ్మో ఇదే ఆటరా నాయనా..? కొబ్బరికాయలు పగలగొట్టేందుకు ఇంత రిస్క్ చేయాలా?' అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివిరాల్లోకి వెళితే..
వివిధ ప్రాంతాలలో జరిగే ఆటలు, వాటి తీరు చాలా విచిత్రంగా ఉంటాయి. మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రంలోనూ ఇలాంటి విచిత్రమైన ఆట ఒకటి ఉంది. వీడియోలో కొంతమంది కుర్రాళ్ళు రహదారి మధ్యలో గుంపుగా నిలబడ్డారు. వీరి మధ్యలో కొబ్బరి కాయలను(coconuts) ఒక సంచిలో పెట్టారు. ఒక కుర్రాడు తన అరచితిలో ఒక కొబ్బరికాయను గట్టిగా పట్టుకుంటాడు. మరొక కుర్రాడు ఇంకొక కొబ్బరికాయను చేతిలో తీసుకుని మొదటి కుర్రాడి చేతిలోని కొబ్బరికాయను తన చేతిలోని కొబ్బరికాయతో పగలగొడతాడు(coconut breaking on the arms). అలా కొట్టినప్పుడు ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగిలితే అలా కొట్టిన వ్యక్తి గెలిచినట్టు. ఇలా కుర్రాళ్లు అందరూ ఒకరి చేతిలో మరొకరు కొబ్బరికాయలు పెట్టుకుని పగలగొడుతున్నారు. కొబ్బరికాయ అరచేతిలో ఉన్నప్పుడు పగిలితే అరచేతి చర్మం కొబ్బరికాయ మధ్య ఇరుక్కుని చేతులకు గాయాలు అయ్యి రక్తం కారే ప్రమాదం ఉంటుంది. అలాంటిది పదే పదే ఇలా కొబ్బరికాయలు కొడుతూ వీళ్లు ఆడుతున్న ఆట చూస్తే నవ్వు వస్తుంది, అందులో ఉన్న ప్రమాదం అర్థమైతే భయం కూడా వేస్తుంది.
2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోటు మన వద్ద ఉంటే.. జైల్లో వేస్తారా..? జరిమానా విధిస్తారా..?
ఈ ఆటకు సంబంధించిన వీడియోను ttl.india అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'కొబ్బరికాయలు పగలగొట్టే పోటీ' అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యపోతుండగా , మరికొందరు ఆ పోటీ గురించి చెబుతున్నారు. 'ఇది మహారాష్ట్రలో జరిగే నారియల్ పూర్ణిమ' అని ఒకరు కామెంట్ చేశారు. 'మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలుసు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఫ్రాన్స్ లో కూడా ఇలాంటి పోటీ జరుగుతుంది' అని ఇంకొకరు చెప్పారు. 'ఆ కొబ్బరికాయలను చేతులలో కాదు తలపై పెట్టుకుని ఆడండి అప్పుడు గేమ్ బాగుంటుంది' అని మరొకరు సెటైర్ వేశారు.