Husband: భర్త వచ్చిన ప్రతీసారి ఆలస్యంగా నిద్రలేస్తున్న 16 ఏళ్ల కూతురు.. నిలదీస్తే రాత్రిళ్లు జరిగింది గుర్తు లేదన్న బాలిక.. అనుమానంతో..

ABN , First Publish Date - 2023-04-08T16:00:29+05:30 IST

లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. అయినా ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు. అయితే ఇటీవల..

Husband: భర్త వచ్చిన ప్రతీసారి ఆలస్యంగా నిద్రలేస్తున్న 16 ఏళ్ల కూతురు.. నిలదీస్తే రాత్రిళ్లు జరిగింది గుర్తు లేదన్న బాలిక.. అనుమానంతో..

లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే పదేళ్ల క్రితం భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. అయినా ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు. అయితే ఇటీవల వారి ఇంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భర్త వచ్చిన ప్రతీసారీ కూతురు ఆలస్యంగా నిద్ర లేస్తోంది. దీంతో తల్లికి అనుమానం వచ్చింది. ఓ రోజు నిలదీయగా రాత్రి జరిగింది గుర్తు లేదని చెప్పింది. చివరకు విచారింరగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) ముజఫర్‌పూర్ మీనాపూర్ పరిధిలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతడి భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. సదరు వ్యక్తి ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే తన పెద్ద కూతురికి వివాహం (marriage) కూడా చేశాడు. ఇదిలావుండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళకూ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె భర్త ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లి తిరిగి రాలేదు. కొన్నేళ్లుగా ఇంటికి రాకపోవడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అసలు ఎదిగిన కూతుళ్లు ఉండడంతో తల్లి ఆందోళన చెంది, తనకు తోడు కావాలనే ఉద్దేశంతో లారీ డ్రైవర్‌ను రెండో వివాహం (Second marriage) చేసుకుంది. ప్రస్తుతం పిల్లలతో పాటూ అతడి వద్దే ఉంటోంది. లారీ డ్రైవర్‌గా (Lorry driver) పని చేస్తూ.. రెండో భార్యను, ఆమె పిల్లలను కూడా ఎంతో బాగా చూసుకునేవాడు. అయితే అతడిలో ఓ కామాంధుడు ఉన్నాడనే విషయం ఆమెకు ఆలస్యంగా అర్థమైంది.

Viral News: మెట్రో రైల్లో కూర్చున్న ఈ బాలుడి ఫొటోను ఓ ఐఏఎస్ అధికారి ఎందుకు ట్వీట్ చేశారు..? అసలీ పిల్లాడి కథేంటంటే..

రోజూ ఇంటికి ఆలస్యంగా వచ్చే అతను.. రెండో భార్య కూతురిపై (daughter) కన్నేశాడు. ఇటీవల ఓ రోజు భార్య ఇంట్లో లేని సమయంలో రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలుపుకొని వచ్చాడు. 16 ఏళ్ల కూతురికి కూల్‌డ్రింక్‌ (Cooldrink) ఇవ్వడంతో కాసేపటికి అపస్మారక స్థితిలోకి (unconsciousness) వెళ్లిపోయింది. అనంతరం బాలికపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. ఇలా తరచూ మత్తు మందు ఇస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ విషయం మొన్నటి వరకూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే భర్త ఇంటికి వచ్చినప్పుడల్లా మరుసటి రోజు ఉదయం కూతురు ఆసల్యంగా నిద్ర లేస్తుండడంతో తల్లికి అనుమానం వచ్చింది.

Viral Video: మాయలు మంత్రాలు వచ్చా ఏంటంటూ ఉలిక్కి పడిన కొలీగ్.. ఖాళీ కవర్లోంచి ఇన్ని ఐటమ్స్ ఎలా వచ్చాయో మీరే చూడండి..!

women-crime-news.jpg

ఓ రోజు కూతురితో ‘‘ఎందుకు ఆలస్యంగా నిద్ర లేస్తున్నావ్’’.. అని అడగడంతో నాకు ఏమీ గుర్తు లేదు అని చెప్పింది. దీంతో ఆమెకు మరింత అనుమానం కలిగింది. ఓ రోజు ఉదయం పరిశీలించగా.. కూతురు ఒంటిపై దుస్తులు లేవు. దీంతో గట్టిగా నిలదీయగా.. ‘‘నాకేమీ గుర్తు లేదు.. రోజూ నాన్న ఇచ్చిన కూల్‌డ్రింక్‌ తాగి పడుకుంటున్నాను’’.. అని బదులిచ్చింది. చివరకు భర్త గట్టిగా నిలదీయగా తన అనుమానం నిజమైంది. భర్తపై దాడి చేసిన ఆమె.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

CCTV Video: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. రైలు కింద పడేందుకు దూకిన యువతి.. పక్కనే నిల్చున్న కుర్రాడు చేయి పట్టుకుని లాగాడు కానీ..

Updated Date - 2023-04-08T16:00:29+05:30 IST