Mosquito Burger: దోమల బర్గర్ గురించి విన్నారా? ఎలా చేస్తారో తెలుసా? దీని వల్ల ఉపయోగం ఏంటి?

ABN , First Publish Date - 2023-08-07T22:50:23+05:30 IST

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో బర్గర్ ఒకటి. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా.. ఎంతో ఇష్టంగా తింటారు. ఆయా ప్రాంతాల్లో దీనిని మరింత రుచికరంగా తయారు చేసేందుకు, కొన్ని రకాల రుచికరమైన పదార్థాలను కూడా జోడిస్తుంటారు.

Mosquito Burger: దోమల బర్గర్ గురించి విన్నారా? ఎలా చేస్తారో తెలుసా? దీని వల్ల ఉపయోగం ఏంటి?

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో బర్గర్ ఒకటి. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా.. ఎంతో ఇష్టంగా తింటారు. ఆయా ప్రాంతాల్లో దీనిని మరింత రుచికరంగా తయారు చేసేందుకు, కొన్ని రకాల రుచికరమైన పదార్థాలను కూడా జోడిస్తుంటారు. కానీ.. ఓ ప్రాంత ప్రజలు మాత్రం దోమలతో తయారు చేసిన బర్గర్లను తింటారు. ఇక్కడ మన హైదరాబాద్‌లో ఎలాగైతే జనాలు ‘బిర్యానీ’ని ఎగబడి తింటారో, అక్కడ కూడా అలాగే దోమల బర్గర్‌ని ఇష్టంగా తింటారు. మనకు ఎబ్బేట్టుగా అనిపించినా, ఇది మాత్రం నిజం. ఇంతకీ ఈ దోమల బర్గర్‌ని ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? ఆఫ్రికాలోనే విక్టోరియాలో!

అసలు దోమలతో బర్గర్ చేసే ఆలోచన ఎలా తట్టి ఉంటుంది? అని మీరు అనుకుంటున్నారా! విక్టోరియాకి సమీపంలో ఉన్న సరస్సులో చాలా దోమలు పెరుగుతున్నాయి. అక్కడి నివసించే ప్రజలకు ఇవి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. బహుశా ప్రపంచంలో ఉన్న దోమలన్నీ, ఆ ఒక్క ప్రాంతంలోనే బస చేశాయేమో అనేంతలా అక్కడ దోమలుంటాయి. అయితే.. ఈ దోమల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయన్న విషయాన్ని అక్కడి ప్రజలు గుర్తించారు. అలాంటప్పుడు వాళ్లు ఊరికే ఉంటారా? తమని రేయింబవళ్లు టార్చర్ పెట్టిన దోమలనే చంపేసి, దోమల బర్గర్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో గొడ్డు మాంసానికి మించి ప్రోటీన్లు ఉంటాయని తెలియడంతో.. మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ వచ్చిపడింది. ఫలితంగా.. ఇది మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది.


అయితే.. ఈ బర్గర్‌ని తయారు చేయడం మరీ అంత సులువు కాదు. ఈ బర్గర్‌లో ఉపయోగించే ఒక్కో టిక్కీని సిద్ధం చేసేందుకు.. దాదాపు ఐదు లక్షల దోమల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి, ఏ రేంజ్‌లో దోమల్ని పట్టుకోవాల్సి ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. అయితే.. ఈ టిక్కీ చూడ్డానికి పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. దోమల్ని చంపి, వాటిని ముద్దగా చేసి, టిక్కీ ఆకారంలో సిద్ధం చేసి, తక్కువ మంటపై కాలుస్తారు. ఆ తర్వాత బర్గర్‌లో కలుపుకొని.. దీన్ని తింటారు. ప్రొటీన్ లేమితో బాధపడేవారికి, ఇది ఎంతో మేలు చేస్తుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఈ బర్గర్ ప్రత్యేకత తెలిసి, కేవలం దీన్ని టేస్ట్ చేయడానికే పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు. అయితే.. మనుషుల రక్తం తాగే దోమల్ని చంపి, బర్గర్‌లో కలుపుకొని తినడమేంటి ఛెండాలంగా? అంటూ కొందరు ఈ వంటకంపై పెదవి విరుస్తున్నారు.

Updated Date - 2023-08-07T22:50:23+05:30 IST