Mysterious Disease in China: కరోనా తర్వాత చైనాలో మరో కలకలం.. స్కూలు పిల్లలకు పాకుతున్న వింత వ్యాధి..!
ABN , First Publish Date - 2023-11-23T20:08:27+05:30 IST
కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామనుకుంటున్న తరుణంలో చైనాలో మరో కలకలం మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామనుకుంటున్న తరుణంలో చైనాలో(China) మరో కలకలం మొదలైంది. చైనా బాలబాలికలు అనేక మంది గుర్తుతెలియని నిమోనియా తరహా వ్యాధి(Mysterious Respirator Illness) బారినపడుతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. కరోనా సంక్షోభం తొలి రోజుల్ని గుర్తుకు తెస్తున్న తాజా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనా రాజధాని బీజింగ్‌తో(Beijing) పాటూ లియావోనింగ్ నగరంలోని స్కూలు విద్యార్థులు అధికసంఖ్యలో ఈ వ్యాధి బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రాజధాని చుట్టూ ఉన్న ఆసుపత్రుల్లోనూ చిన్నారుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతోంది. స్థానికంగా స్కూళ్లు కొన్ని రోజుల పాటు మూసేయక తప్పదని స్థానిక మీడియా చెబుతోంది. ఊపిరితిత్తుల ఇన్‌ఫ్లమేషన్, తీవ్ర జ్వరంతో బాధిత చిన్నారులు బాధపడుతున్నారు. అయితే, ఫ్లూ వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కనిపించే దగ్గు వీరిలో కనిపించకపోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది.
Viral: షాకింగ్ వీడియో! భర్త వద్ద బైక్ నేర్చుకుంటున్న మహిళ..అతడు వెనక నుంచి అరుస్తున్నా వినకుండా..
కాగా, తాజా సంక్షోభం గురించి ప్రోమెడ్ (Promed) అనే సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్న వైనాన్ని ఈ సంస్థ ఓ కంటకనిపెడుతూ ఉంటుంది. గుర్తుతెలియని ఈ నిమోనియా వ్యాధి పిల్లలకే అధికంగా సోకుతోందని వెల్లడించింది. కరోనాకు పూర్వం కూడా ప్రోమెడ్ ఇదే తరహా హెచ్చరికలు చేయడంతో తాజా పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాధి వ్యాప్తి ఎప్పుడు మొదలైందో ఇప్పుడే చెప్పడం కష్టమని ప్రోమెడ్ వ్యాఖ్యానించింది. స్వల్ప వ్యవధిలో ఇంత మంది పిల్లలు ఈ వ్యాధి బారినపడటం కూడా అసాధారణమని అభిప్రాయపడింది. అయితే, పెద్దలెవరికీ ఇప్పటివరకూ ఈ వ్యాధి సోకకపోవడంతో దీని మూలాలు వెలికి తీసేందుకు చైనా అధికారులు స్కూళ్లపై దృష్టి కేంద్రీకరించారు.
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..