Share News

Success Story: 16 ఉద్యోగాలను రిజెక్ట్ చేసింది.. చివరకు అనుకున్నది సాధించింది.. ఈ మహిళా ఐపీఎస్ కథ తెలుసుకుంటే..

ABN , First Publish Date - 2023-10-14T19:36:02+05:30 IST

ప్రస్తుతం మన దేశంలో విజయవంతమైన అతికొద్ది మంది ఐపీఎల్ అధికారుల్లో తృప్తీ భట్ ఒకరు. ఐపీఎస్ కావడం ఒకటే ఆమె గుర్తింపు కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే ఎన్నో విజయాలను ఆమె చాలా సునాయాసంగా అందుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన తృప్తి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు.

Success Story: 16 ఉద్యోగాలను రిజెక్ట్ చేసింది.. చివరకు అనుకున్నది సాధించింది.. ఈ మహిళా ఐపీఎస్ కథ తెలుసుకుంటే..

ప్రస్తుతం మన దేశంలో విజయవంతమైన అతికొద్ది మంది ఐపీఎల్ అధికారుల్లో తృప్తీ భట్ (Trupti Bhatt) ఒకరు. ఐపీఎస్ (IPS) కావడం ఒకటే ఆమె గుర్తింపు కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే ఎన్నో విజయాలను ఆమె చాలా సునాయాసంగా అందుకున్నారు. ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని అల్మోరాకు చెందిన తృప్తి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆమె ఏకంగా 16 ఉద్యోగాలను సాధించింది. వాటన్నింటినీ తిరస్కరించి చివరకు ఐపీఎస్‌ను ఎంచుకుంది. తృప్తి భట్ విజయ గాథ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది (Success Story).

అల్మోరాకు చెందిన తృప్తి భట్ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. తన నలుగురు తోబుట్టువులలో ఆమె పెద్దది. ఆమె 9వ తరగతి చదువుతుండగా దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam)ను కలిసే అవకాశం వచ్చింది. కలాం స్వయంగా తన చేతులతో రాసిన లేఖను తృప్తికి ఇచ్చారు. అందులో ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలు ఉన్నాయి. కలాం నుంచి స్ఫూర్తి అందుకున్న తృప్తి చదువులో అమోఘంగా రాణించింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన తర్వాత తృప్తి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసింది. ఆ తర్వాత ఇస్రో సహా ఆరు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో తృప్తి ఉత్తీర్ణత సాధించింది.

Bengaluru: బెంగళూరు మహిళకు షాకింగ్ అనుభవం.. రైడ్ క్యాన్సిల్ చేసిందని క్యాబ్ డ్రైవర్ ఎలా పగ తీర్చుకున్నాడంటే..

తృప్తి చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అధికారి కావాలని కోరుకుంది. దీంతో ఆమె తనకు వచ్చిన గొప్ప గొప్ప ఆఫర్లన్నింటినీ వదులకుంది. ఇస్రోలో అవకాశం వచ్చినా తిరస్కరించింది. తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిణి అయింది. తృప్తి కేవలం చదువులోనే కాదు.. ఆటల్లో కూడా సత్తా చాటింది. ఆమె మారథాన్, రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్ని బంగారు పతకం సాధించింది. అలాగే తైక్వాండో, కరాటేలో కూడా నిపుణురాలు అనిపించుకుంది.

Updated Date - 2023-10-14T19:36:02+05:30 IST