Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

ABN , First Publish Date - 2023-01-25T18:00:12+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. భాయ్ జాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

Kisi Ka Bhai Kisi Ki Jaan: యాక్షన్ ఎంటర్ టైనర్‌గా సల్మాన్ ఖాన్ సినిమా

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). అతడు తాజాగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. భాయ్ జాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్టు తెలుస్తోంది. టీజర్‌లో యాక్షన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్ని రకాల భావోద్వేగాలకు చోటిచ్చారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు పంచ్ డైలాగ్స్ కూడా ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. వెంకటేశ్, జగపతి బాబు, షెహనాజ్ గిల్, విజేందర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఫర్హద్ సామ్జీ (Farhad Samji) తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈద్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) లో అతిథి పాత్రను పోషించాడు. మసూమ్ భాయ్ పాత్రలో కనిపించాడు. షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ లోను మెరిశాడు. ప్రస్తుతం ‘టైగర్ 3’ (Tiger 3) లో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషిస్తున్నాడు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-01-25T18:06:46+05:30 IST

News Hub