Tattoo: నాటి పచ్చబొట్టు.. నేటి టాటూ
ABN , Publish Date - Mar 21 , 2025 | 10:56 AM
నేటి సమాజంలో టాటూకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువత ఈ టాటూల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గతంలో విదేశాలకే పరిమితమై ఈ క్రేజ్ నేడు మన దేశంలోని పల్లె వాతావరణానికి పాకింది. నేడు ప్రపంచ ‘టాటూ’ దినోత్సవం సందర్భంగా...

- నేడు ప్రపంచ ‘టాటూ’ దినోత్సవం
- యువతలో పెరుగుతున్న ఆదరణ
- అనాధలకు అండగా ‘డూడో’ నాగార్జున
హైదరాబాద్: ఆదిమ కాలం నుంచి పచ్చబొట్టుకు ఆదరణ కొనసాగుతూనే ఉంది. ఓ సమూహంగా జీవించిన మానవులు తమ వారిని గుర్తుపట్టడానికి వీలుగా, వారి శరీరాలపై పచ్చబొట్టు వేయించుకునే వారు. ఒక్కో సమూహానిది ఒక్కో ప్రత్యేకతతో కూడిన డిజైన్. ప్రాచీన నాగరికతల గురించి జరిగిన పరిశోధనల్లో ఈ పచ్చబొట్లు కూడా కీలక ఆధారాలుగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. గ్రీకు, రోమన్, సింధు, మెసపటోనియా, ఈజిప్టు నాగరికతల్లో పచ్చబొట్లది ప్రత్యేక స్థానం.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మాట్లాడుకుంటున్న జంటపై దాడి..
మారుతోన్న కాలంతో పాటు పచ్చబొట్టు ఆధునిక పోకడలను సంతరించుకుని ‘టాటూ’(Tattoo)గా రూపాంతరం చెందింది. కాలేజీ కుర్రకారు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఈ టాటూలకు దేశ విదేశాల్లో ఆదరణ పెరుగుతూనే ఉంది. ప్రాంత, వర్గ, లింగ, వర్ణ భేదం లేకుండా, ఏ మతానికి చెందిన వారినైౖనా, ఏ వయసులో ఉన్న వారినైనా ఈ టాటూ ఆకట్టుకుంటోంది అనడంలో సందేహం లేదు. అయితే, ఈ టాటూ వేయించుకోడం కంటే తొలగించాలంటే రెట్టింపు నొప్పితో పాటు ఖర్చును భరించాలి.
ఆసక్తితో నేర్చుకొని..
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, తనకంటూ ప్రత్యేకత ఉండాలనే లక్ష్యంతో యువతరం ఈ టాటూల వృత్తిలోకి అడుగు పెడుతోంది. చిన్నప్పడు నేర్చుకున్న డ్రాయింగ్, ఆర్ట్స్‌కు తోడు సృజనాత్మకత ఉన్న యువకులు ఈ రంగంలో రాణిస్తున్నారు.
‘డూడో’గా నాగార్జున
పుష్కర కాలంగా ‘టాటూస్ అండ్ పియర్సింగ్’ వృత్తిలో కొనసాగుతున్న ‘డూడో’ అసలు పేరు నాగార్జున(Nagarjuna). ఈసీఐల్‌లోని డీఏఈ కాలనీలోని ఏఈసీఎస్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన నాగార్జున బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరిన తర్వాత టాటూ డిజైనింగ్‌పై ప్రత్యేక శిక్షణ, గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకున్న ఇతని వద్ద విదేశీయులు, పలువురు సెలబ్రిటీలు టాటూలు వేయించుకున్నారు. తన స్టూడియోలో వచ్చే ఆదాయంలో కొంత శాతం అనాధ పిల్లల కోసం కేటాయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నాఆటోచనలకు చిత్ర రూపం ఇస్తూ
నాఆటోచనలకు చిత్ర రూపం ఇస్తూ స్వయంగా గీసుకున్న డిజైన్‌లు, కస్టమర్‌లు సూచించిన డిజైన్‌లు, పేర్లు, దేవతా రూపాలను శరీరంపై వారు చూపిన చోట టాటూగా వేస్తాం. ప్రస్తుతం ఎన్నో రంగుల్లో వస్తున్న టాటూ సిరా ఎంపికలో జాగ్రత్త వహించాలి. గతంలో మాదిరిగా సూదులతో టాటూ వేసే పద్ధతి మారిపోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తే అవకాశం లేదు.
- నాగార్జున, డూడో టాటూస్ అండ్ పియెర్సింగ్
ఈ వార్తలు కూడా చదవండి:
Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
BJP: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు
పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
Read Latest Telangana News and National News