Newly Weds fall into Canal: ఇందుకే మనసును కంట్రోల్ చేసుకోవాలనేది.. ఈ కొత్త జంట పరిస్థితి ఏమైందో చూస్తే
ABN , Publish Date - Mar 20 , 2025 | 08:57 PM
ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫొటోలు దిగుదామనుకున్న ఓ వధూవరులకు ఊహించని షాక్ తగింది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో పొట్ట చెక్కలయ్యేలా జనాల్ని నవ్విస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా జమానాలో కొత్త ట్రెండ్‌ను అందిపుచ్చుకోవాలని తాపత్రయ పడేవారు నానాటికీ పెరిగిపోతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లో కూడా ఈ ఉబలాటం ఎక్కువైపోతోంది. ఇక పెళ్లిలో జంటలు చేసే హాడావుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, పెళ్లికి ముందు ఫొటో షూట్లు ఇలా రకరకాలుగా లొల్లి చేస్తున్నారు. ఈ సరదాలు మంచివే కానీ మనకున్న హద్దులు ఏవో తెలుసుకుని మసులు కోవాలి. కొత్తగా ఏదైనా చేద్దాం.. ఆ క్షణాలను శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేసుకుందాం లాంటి సినిమాటిక్ డైలాగుల ప్రభావానికి లోనైతే మాత్రం చిక్కులు తప్పవు. ఇటీవల కొత్తగా పెళ్లైన ఓ జంటకు సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Newly Weds fall into Canal Viral Video)
Also Read: భయానక దృశ్యం.. సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కితే
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, పెళ్లి సంబరంలో ఉన్న నూతన వధూవరులు ఫొటో షూట్‌కు సిద్ధమయ్యారు. వారు ఏదోక మంచి బ్యాక్ గ్రౌండ్ ఎంచుకుని ఫొటోలు దిగి ఉంటే సరిపోయేది. కానీ వారు అలా చేయలేదు. ఫొటో గ్రాఫర్ ఇలా సలహా ఇచ్చాడో లేక తమ సొంత తెలితేటలు ఉపయోగించారో కానీ వారు కాలవపై పొజులిస్తూ ఫొటో దిగుదామని అనుకున్నారు. ఓ చిన్న కాలువపై వంతెనగా వేసి కొబ్బరి చెట్టు కాండంపై ఒకేసారి నిలబడేందుకు వెళ్లారు. కొంత సేపు ఇద్దరూ దానిపై నిలబడి మ్యానేజ్ చేసినా చూస్తుండగానే పరిస్థితి అదుపు తప్పిపోయింది. మొదటి ఒకరికి బ్యాలెన్స్ తప్పడంతో రెండో వారు కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఇద్దరు నీళ్లల్లో పడిపోయారు. కాలవలో పెద్దగా నీరు లేకపోవడంతో ఒళ్లంతా బురద అయ్యింది.
Also Read: పైఅధికారులకు రాసిన లేఖలో తప్పులు.. మహిళా పోలీసు జైలు పాలు.. అసలేం జరిగిందో తెలిస్తే..
ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. తమ పెళ్లి చిరస్మరణీయంగా మార్చుకునేందుకు అతిగా ఉబలాట పడితే మాత్రం ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు. ఇది కూడా ఓ తీపి జ్ఞాపకమని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే, ఇలాంటి అతి చేష్టలు ఉపద్రవాలకు కూడా కారణమవుతాయని అన్నారు. ఈ మధ్య కాలంలో యువత ఇలాంటి ఇబ్బందుల్లో పడటం సాధారణమైపోయిందని మరికొందరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.