Iceberg Flips Over: భయానక దృశ్యం.. సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కితే
ABN , Publish Date - Mar 20 , 2025 | 08:42 PM
సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కిన సాహసికులు ఊహించని ప్రమాదంలో పడ్డారు. వారు ఎక్కగానే మంచు ఫలకం తిరగబడటంతో సముద్రంలో మునిగిపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: సముద్రంలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఊహించడం కష్టం. భారీ సముద్ర అలలు.. భయానక జలచరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రమాదాలు ఆ జలరాశిలో దాగునున్నాయి. ఇక సముద్రంలో సాహసాలకు పూనుకుంటే కొత్త తరహా ప్రమాదాలు ఎదురువుతాయి. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో పాతదే అయినప్పటికీ దీన్ని తొలిసారిగా చూస్తున్న యువత తరం వణికిపోతోంది (North Sea iceberg flip Viral video).
ఆర్కిట్ ఖండం రహస్యాల్ని అధ్యయనం చేసేందుకు వెళ్లిన కొందరు ఔత్సాహిక నిపుణులు మైక్ హార్న్, ఫ్రెడ్ రో ఉత్తర ధ్రువం సముద్రంలో తేలి ఆడుతున్న భారీ మంచు ఫలకంపై ఎక్కే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వారిద్దరూ ప్రొఫెషనల్స్. ఇలాంటి సాహసాలకు పూనుకోవడం వారికి పరిపాటి. కానీ ప్రకృతి ముందు ఎంతటి అనుభవజ్ఞులైనా పసికూనలే. వాటి ప్రతాపం చూస్తే అల్లాడిపోవాల్సిందే. తాజాగా వీడియోలో సరిగ్గా ఇదే జరిగింది.
Also Read: పైఅధికారులకు రాసిన లేఖలో తప్పులు.. మహిళా పోలీసు జైలు పాలు.. అసలేం జరిగిందో తెలిస్తే..
మంచుఫలకంపై ఎక్కేందుకు మైక్ ఫ్రెడ్ పక్కా ప్లాన్ చేశారు. ముందుగా వాటిపై తాళ్లు కదలకుండా కట్టి వాటి సాయంతో ఎక్కే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని మరో నావలోని సిబ్బంది జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవసరమైన సమయంలో సాయం చేసేందుకు రెడీ ఉన్నారు.
ఇంతలోనే ఊహించని ప్రమాదం ఎదురైంది. సాహసికుల బరువుకు సముద్రంలోని మంచుఫలకం ఒక్కసారిగా తిరగబడింది. సాహసికులు ఉన్న వైపు బరువు ఎక్కువగా ఉండటంతో మంచుఫలకం అటువైపు పూర్తిగా ఒరిగిపోయింది. సాహసికులు ఉన్న భాగమంతా నీళ్లల్లో మునిగింది. అయితే, అప్పటికే నావలోని సిబ్బంది అప్రమత్తమై వారిని కాపాడారు. ఇక సాహసికులకు ఇలాంటి ప్రమాదాల గతంలో ఎదుర్కొన్నారు కాబట్టి జాగ్రత్తగా బయటపడగలిగారు.
Also Read: భారతీయ వీధులు శుభ్రం చేసిన విదేశీ టూరిస్టులు!
ఇక ఈ వీడియో చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. సముద్రంలో తేలే మంచుఫలకంపై ఎవరైనా ఎక్కాలని అనుకుంటారా? ఇలా చేసి ఏం సాధిద్దామనుకున్నారు అని కొందరు ప్రశ్నించారు. సాహసికుల అసలు ఉద్దేశం తమ పరిమితులు ఏమిటో తెలుసుకోవడమేనని అన్నారు. ఇలాంటి సాహసాలే పునాదులుగా మానవ సమాజం అభివృద్ధి చెందిందని కొందరు కొత్త సిద్ధాంతం తెరమీదకు తెచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.