Shopping Malls: భారీ డిస్కౌంట్స్ ఆఫర్ల వెనుక భారీ మోసం.. షాపింగ్ మాల్స్ ఇలా కూడా మోసం చేస్తాయని అస్సలు ఊహించలేరు..!

ABN , First Publish Date - 2023-03-06T17:22:27+05:30 IST

డిస్కౌంట్స్ చూసి కొంటుంన్నాం, సేవింగ్స్ చేస్తున్నాం అని గర్వంగా ఫీలైపోతుంటారు. కానీ షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లను ఎలా బురిడీ కొడుతున్నాయో తెలిస్తే..

Shopping Malls: భారీ డిస్కౌంట్స్ ఆఫర్ల వెనుక భారీ మోసం.. షాపింగ్ మాల్స్ ఇలా కూడా మోసం చేస్తాయని అస్సలు ఊహించలేరు..!

ఇప్పటికాలంలో షాపింగ్ రుచి ఎరుగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 'నేను సాధారణ సమయాల్లో షాపింగ్ అసలు చేయను, డిస్కౌంట్లు చూసి షాపింగ్ చేస్తాను. దానివల్ల బోలెడు సేవింగ్స్' అని చాలా మంది స్నేహితులకు, బంధువులకు చెప్పి గర్వంగా ఫీలవుతూ ఉంటారు. అయితే షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లను ఎలా బురిడీ కొడుతున్నాయో తెలిస్తే షాకవుతారు. భారీ డిస్కౌంట్ల వెనక ఉన్న అసలు వ్యవహారం తెలుసుకుంటే..

నగరాల నుండి చిన్నచిన్న పట్టణాల వరకు ఇప్పుడు షాపింగ్ మాల్స్(Shopping malls) తప్పనిసరిగా ఉంటున్నాయి. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక బంపర్ ఆఫర్(Bumper Offer) లేదా భారీ డిస్కౌంట్(Big Discount) నడుస్తోంటుంది. సాహసవీరుడు సాగర కన్య సినిమాలో విజయలలిత ఆకర్ష ఆకర్ష అంటూ ఉంటుందే.. అదే ఆకర్షణా మంత్రమే ఈ షాపింగ్ మాల్స్ చేసే పని కూడా. అలాగని ఇదేదో మాయల మంత్రం అనుకుంటారేమో.. అసలు కాదు, వారు చేసేది కస్టమర్లను తమ షాపింగ్ మాల్ వైపు ఆకర్షించడం. అదే బిజినెస్ ట్రిక్కు.. ఒక్కసారి ఆ షాపింగ్ మాల్స్ లో అడుగుపెడితే ప్రజలు పూర్తిగా వస్తువుల మాయలో పడిపోతారు. నిజం చెప్పాలంటే కొనాలనుకున్న వస్తువుకు అనుబంధంగా పది వస్తువులను ఇంటికి పట్టుకెళ్ళేవారు అధికంగా ఉంటారు. పిల్లలు ఇష్టపడే వస్తువులను తక్కువ ఎత్తులో వారికి అందే విధంగా ఉంచుతారు. దీంతో పిల్లలు గోల చేసయినా వాటిని తల్లిదండ్రులు కొనేలా చేస్తారు.( సహజంగా షాపింగ్ మాల్స్ లో ఎంఆర్పీ ధర(MRP Price)ను డబుల్ చేస్తారు. తరువాత అందులో 25శాతం డిస్కౌంట్(Discount) ఇస్తారు. కస్టమర్లు 25శాతం డిస్కౌంట్ చూసి అదృష్టమంతా తమదే అన్న్టటు ఫీలైపోతారు. తాము డిస్కౌంట్ కింద వస్తువులు కొని సేవింగ్స్ చేస్తున్నామని సంతోషపడుతుంటారు.

Read also: డిప్రెషన్ కు మందులు వాడుతున్నారా? అయితే మీరు చాలా తప్పు చేస్తున్నారు..


షాపింగ్ మాల్స్ కు వెళ్లినపుడు గమనిస్తే.. ఎంట్రీ డోర్ తప్ప ఎక్కడా కిటికీలు, ఓపెన్ షట్టర్ లు, తలుపులు ఉండవు. దీనివల్ల మాల్ లో ఉన్న లైట్ల వెలుగుకు వస్తువులు షైన్ అవుతాయి. ఆ మెరుపులు మన కళ్ళను ఆకర్షిస్తాయి. అక్కడ మరొక గిమ్మిక్ ఉంది. మనం ట్రాలీ పట్టుకుని వస్తువుల కోసం అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు చాలామంది రైట్ సైడ్ టర్న్అవుతారు. ఈ రైట్ సైడ్ కచ్చితంగా ఏదో ఒక ఆఫర్ బోర్డ్ మెరుస్తూ ఆకర్షిస్తుంది. స్వతహాగా కుడివైపు తిరగడం మనుషుల స్వభావం, దీన్ని ఆధారం చేసుకుని ఇలాంటి బోర్డ్ లు కుడివైపునే పెడతారు. కస్టమర్ ల నుండి ప్రతి షాపింగ్ మాల్ లో ఫోన్ నెంబర్, ఇమెయిల్ అడుగుతారు. దీనివెనుక కారణం ఎప్పటికప్పుడు ఆయా షాపింగ్ మాల్స్ డిస్కౌంట్స్ గురించి మెసేజ్ ల రూపంలో మెయిల్స్ రూపంలో కస్టమర్స్ ను అలెర్ట్ చేస్తుంది. అలాగే చాలావరకు షాపింగ్ మాల్స్ లో 99, 199, 299, 399 అంటూ ధరలు ఉంటాయి. దీన్ని చూసి కూడా జనాలు అట్రాక్ట్ అవుతారు. సరిగ్గా గమనిస్తే షాపింగ్ మాల్స్ తాము తొందరగా వదిలించకోవాలని అనుకునే వస్తువుల పైన భారీ డిస్కౌంట్ ఇస్తుంటుంది. కొన్ని చోట్ల ఎక్స్పైరీ డేట్ లేబుల్స్ మార్చి డిస్కౌంట్లు ఇస్తారు. ఎక్స్పైరీ డేట్ చాలా దగ్గరలో ఉన్న వస్తువులను ఇలాగే వదిలించుకుంటారు. ఇలా డిస్కౌంట్ల వెనుక బోలెడు గూడుపుఠాణీ ఉంది.

Updated Date - 2023-03-06T17:22:27+05:30 IST