Sikkim: పిల్లలను కంటే ఇంక్రిమెంట్.. ప్రభుత్వ ఉద్యోగినులకు సిక్కిం సీఎం ఆఫర్!
ABN , First Publish Date - 2023-01-17T21:11:08+05:30 IST
భారత దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లు దాటేసింది. మరో రెండు, మూడేళ్లలో చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జనాభా నియంత్రణను పాటించాలని విజ్ఞప్తి చేస్తుంటాయి.
భారత దేశ జనాభా ఇప్పటికే 140 కోట్లు దాటేసింది. మరో రెండు, మూడేళ్లలో చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జనాభా నియంత్రణను పాటించాలని విజ్ఞప్తి చేస్తుంటాయి. అయితే సిక్కిం (Sikkim) ముఖ్యమంత్రి మాత్రం పిల్లలను కనాలని తమ రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. అంతేకాదు పిల్లలను కనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు.
ఇటీవలి కాలంలో సిక్కిం మహిళలు ఒక బిడ్డతోనే సరిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తి రేటు బాగా పడిపోయింది. అందుకే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ (Sikkim CM Prem Singh Tamang) జనన రేటును (Birth Rate) పెంచేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. సర్వీస్‌లో ఉన్న మహిళలు గర్భం దాలిస్తే ఒక సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు (Maternity Leave) ఇస్తామన్నారు. అలాగే పురుషులకు 30 రోజులు పితృత్వ సెలవులు ఇవ్వబోతున్నారు. ఇద్దరు పిల్లలను కంటే ఒక ఇంక్రిమెంట్, ముగ్గురు పిల్లలను కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. ఇక, ఐవీఎఫ్ (IVF) ద్వారా పిల్లలను కనాలనుకుంటే రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని తమాంగ్ పేర్కొన్నారు.