TFI: ముగిసిన నిర్మాతల మండలి ఎన్నికలు.. ఎవరు గెలిచారంటే!
ABN , First Publish Date - 2023-02-19T17:18:13+05:30 IST
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ముగిశాయి. 2019 తర్వాత జరిగిన ఎన్నికలివి. ఎన్నికల వాయిదాకు కరోనా ఓ కారణమైతే, నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ విభాగాల్లో అంతరంగికంగా ఉన్న సమస్యలుమరో కారణం.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు (Producers council elections) ముగిశాయి. 2019 తర్వాత జరిగిన ఎన్నికలివి. ఎన్నికల వాయిదాకు కరోనా ఓ కారణమైతే, నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ (producers guild) విభాగాల్లో అంతరంగికంగా ఉన్న సమస్యలుమరో కారణం. దీని వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. పలు చర్చలు, విమర్శల తర్వాత ఎట్టకేలకు ఈ ఆదివారం ఎన్నికలు నిర్వహించారు నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌గా కె.ఎల్.దామోదర ప్రసాద్ (K l damodara prasad)గెలుపొందారు. ఎన్నికల్లో 678 ఓట్లు పోల్ కాగా, 339 ఓట్లు...దామోదర ప్రసాద్‌కు, ప్రత్యర్థి జెమిని కిరణ్‌కి (Gemini kiran) 315 ఓట్లు పోల్ అయ్యాయి. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ - అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా ప్రసన్నకుమార్ (378), వైవీఎస్ చౌదరి (362) ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్, ట్రెజరర్‌గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గెలుపొందారు.
ఈసీ మెంబర్స్‌గా గెలుపొందింది వీరే..
దిల్ రాజు (470 ఓట్లు)
దానయ్య- 421
రవి కిషోర్ - 419
యలమంచిలి రవి- 416
పద్మిని- 413
బెక్కం వేణుగోపాల్- 406
సురేందర్ రెడ్డి- 396
గోపీనాథ్ ఆచంట- 353
మధుసూదన్ రెడ్డి- 347
కేశవరావు- 323
శ్రీనివాద్ వజ్జ- 306
అభిషేక్ అగర్వాల్-- 297
కృష్ణ తోట- 293
రామకృష్ణ గౌడ్- 286
కిషోర్ పూసలు- 285