Viral Video: పాపం.. 21 ఏళ్ల ఈ యువతికి ప్రతిరోజూ నరకమే.. ఏది తిన్నా అలెర్జీ.. ఈమె ట్రీట్మెంట్ వీడియోను చూస్తే..!
ABN , First Publish Date - 2023-11-25T15:22:02+05:30 IST
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం అంటే అలెర్జీ ఉంటుంది. పడకూడని ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకరికి వంకాయ పడదు. మరొకరికి పుట్టుగొడుగులు పడవు. మరికొందరికి పాలు లేదా పెరుగు అంటే అలెర్జీ ఉంటుంది
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం అంటే అలెర్జీ (Food Allergie) ఉంటుంది. పడకూడని ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకరికి వంకాయ పడదు. మరొకరికి పుట్టుగొడుగులు పడవు. మరికొందరికి పాలు లేదా పెరుగు అంటే అలెర్జీ ఉంటుంది. కానీ, దక్షిణ కొరియాలోని సియోల్ (Seoul)కు చెందిన ఓ యువతికి 37 కంటే ఎక్కువ పదార్థాలు పడవు. అవి కనుక తింటే ఆమె శరీరంపై దద్దుర్లు మొదలవుతాయి. ఆమె తన పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.
సియోల్‌కు చెందిన జోన్ అనే యువతికి ప్రతిరోజూ నరకమే. ఆమె ఏం తిన్నా శరీరంపై దద్దర్లు మొదలవుతాయి. ``నాకు 37 అంటే ఇష్టం కాబట్టి నాకు 37 అలెర్జీలు ఉన్నాయని చెప్పాను. కానీ, నాకు పడని ఆహార పదార్థాల సంఖ్య అంతకంటే ఎక్కువే`` అని జోన్ పేర్కొంది. పడని ఆహార పదార్థాలు తిన్న పది నిమిషాల్లోనే ఆమె శరీరంపై దద్దర్లు మొదలవుతాయి. వెంటనే ఆమె క్లినిక్‌కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆమె తాజాగా తన ట్రీట్మెంట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ``నేను చనిపోవడానికి 37 మార్గాలున్నాయి`` అని జోన్ పేర్కొంది (Allergic to 37 foods).
Elephant Video: బురద గుంటలో పడిన ఏనుగు.. పైకి రాలేక నరకయాతన.. చిమ్మచీకటిలో దాన్ని ఎలా కాపాడారంటే..!
జోన్‌కు అలెర్జీ కలిగించే ఆహార పదార్థాల జాబితాలో పప్పులు, సీ ఫుడ్, కొన్ని పండ్లు వంటి సాధారణ ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. పడని ఆహార పదార్థాలను తిన్న పది నిమిషాల్లోనే రియాక్షన్ మొదలవుతుందని జోన్ పేర్కొంది. జోన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 12 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. జోన్ ఆరోగ్య పరిస్థితిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత సమస్య ఉన్నప్పటికీ నవ్వుతూ ఉన్న ఆమె స్థైర్యం ఎంతో మందికి స్ఫూర్తి అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.