Train Journey Rules: రైలు ప్రయాణాలు చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్.. రాత్రి 10 తర్వాత టికెట్లను టీటీఈ ఎందుకు చెక్ చేయరంటే..

ABN , First Publish Date - 2023-03-07T11:14:33+05:30 IST

ప్రతిరోజూ రైళ్ళలో 2.30కోట్లమంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. కానీ వీరిలో రైల్వే వారి నిబంధనలు ఎంతమందికి తెలుసనేది ప్రశ్నార్థకమే..

Train Journey Rules: రైలు ప్రయాణాలు చేసే వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్.. రాత్రి 10 తర్వాత టికెట్లను టీటీఈ ఎందుకు చెక్ చేయరంటే..

ఇండియన్ రైల్వేస్(Indian Railways) తమ ప్రయాణికుల కోసం చాలా సౌకర్యాలు కల్పించడంతో పాటు మరెన్నో నియమాలు కూడా ఏర్పాటుచేసింది. రైల్వేస్టేషన్ కు వెళ్ళడం, టికెట్ కొనుగోలు చేయడం, ప్లాట్ ఫామ్ చూసుకుని ట్రైన్ ఎక్కడం, తమ గమ్యస్థానం రాగానే చక్కా దిగి వెళ్ళిపోవడం. ఈ విషయాలు తప్ప చాలా మందికి రైల్వే నిబంధనలేవీ(Railway rules) తెలియవు. భారతదేశంలో ప్రతిరోజూ రైళ్ళలో 2.30కోట్లమంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. కానీ వీరిలో రైల్వే వారి నిబంధనలు ఎంతమందికి తెలుసనేది ప్రశ్నార్థకమే.. ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకుంటే ప్రయాణం కాస్త సులువుగా, సౌకర్యంగా జరిగిపోతుంది. కొన్ని నష్టాలు తప్పిపోతాయి. ఇంతకీ ఆ రూల్స్ ఏంటంటే..

రైలు ప్రయాణాలు చేసేవారు చాలామంది రిజర్వేషన్(Reservation) చేసుకుంటుంటారు. పండుగ సీజన్(Festivals), హాలీడేస్(Holidays), ప్రయాణాలు చేయాల్సిన ఇతర సమయాల్లో ట్రైన్లలో సీట్లు చాలా తొందరగా రిజర్వ్ అయిపోతాయి. కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన ప్రాంతం వరకు మనకు సీట్ దొరకదు. అలాంటప్పుడు అందరికీ ఓ చక్కని మార్గం ఏర్పాటుచేసింది ఇండియన్ రైల్వే. మనం వెళ్ళాలనుకున్న చోటుకు సీటు దొరకని పక్షంలో దానికి ముందు ఎక్కడి వరకు సీట్ దొరుకుతుందో అక్కడికి రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రయాణంలో ఉండగా టిటిఈ(TTE) ని సంప్రదించి అదనపు ఛార్జీలు చెల్లించి అదే ట్రైన్లో మనం వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్లచ్చు. అయితే ఈ ప్రాసెస్ లో సీటు మారాల్సిఉంటుంది.

Read also: Shocking Video: చెవిలో నొప్పిగా ఉంది.. ఏమయిందో చూడమని చెప్పిందో తల్లి.. సరేనని ఆ కూతురు టార్చ్‌లైట్ వేసి మరీ చూస్తే..


ట్రైన్ జర్నీ చేసేవారు స్లీపింగ్ బెర్త్(Sleeping Berth) తీసుకున్నా అందులో మిడిల్ బెర్త్(Middle Berth) కు ఉన్న రూల్స్ పూర్తిగా విభిన్నం. ఈ మిడిల్ బెర్త్ ను రాత్రి 10గంటల నుండి ఉదయం 6గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. పగటి పూట ఈ బెర్త్ ను ఓపెన్ చేయడం వల్ల కింది బెర్త్, పైన బెర్త్ ప్రయాణికులకు చాలా సమస్య అవుతుంది. ఈ నియమం తెలుసుకోకుండా మిడిల్ బెర్త్ ఓపెన్ చేస్తే ప్రయాణికుల నుండి మాత్రమే కాక, రైల్వే అధికారుల నుండి కూడా ఇబ్బందులు తప్పవు.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే రెండు స్టాప్ ల నియమం(Two Stops rule) ఒకటుందని చాలా మందికి తెలియదు. ట్రైన్ సీట్ రిజర్వేషన్ చేసుకుని, రైల్వే స్టేషన్ కు వెళ్ళాక కొన్నిసార్లు ట్రైన్ తప్పిపోతుంటుంది. అలాంటి సమయంలో ఈ రెండు స్టాప్ ల రూల్ బాగా ఉపయోగపడుతుంది. ట్రైన్ మిస్సయ్యాక మీరు వేరే మార్గం గుండా తరువాత వచ్చే స్టాప్ కు చేరుకుని మీ సీట్ లో మీరు కూర్చోవచ్చు. టిటిఈ కూడా తరువాత స్టాప్ వచ్చేవరకు మీ సీట్ ను మరొకరికి కేటాయించలేరు.

దూర ప్రయాణాలు(Long Journey) చేయాలంటే చాలామంది ఆప్షన్ రాత్రి సమయమే.. ఎంచక్కా స్లీపింగ్ బెర్త్ లో పడుకుని వెళ్ళిపోవచ్చని అనుకుంటారు. దానికి అనుగుణంగానే సీట్లు రిజర్వేషన్ చేసుకుంటారు. అయితే రాత్రి 10గంటలు దాటిన తరువాత తోటి ప్రయాణికులు ఇబ్బంది పడే ఏ పని చేయకూడదు. రాత్రి 10గంటల తరువాత ఫోన్ మాట్లాడటం, పాటలు, సినిమాలు అందరికీ వినబడేటట్టు ప్లే చేయడం, ట్రైన్లో పుట్టినరోజులు, కేక్ కటింగ్ లు చేయడం, లైట్లు వేయడం, గట్టిగట్టిగా మాట్లాడటం వంటివి అసలు చేయకూడదు. ఇలా చేస్తే రైల్వే వారికి కంప్లైంట్ వెళితే.. ఫైన్ పడుతుంది.

ప్రయాణికులకు ఎలాంటి డిస్టర్బ్ ఉండకూడదనే రాత్రి 10గంటల తరువాత టికెట్ చెక్ చేయడానికి టిటిఈ రాడు, 10గంటల తరువాత ట్రైన్ లలో ఆహారం అందించకపోవడానికి కూడా ఇదే కారణం.

Updated Date - 2023-03-07T11:14:33+05:30 IST