Viral Video: కాల్చబోతుంటే.. తుపాకీకే ఎదురు నిలిచిన జింక.. దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2023-02-11T21:14:40+05:30 IST
వేటాడే క్రమంలో మనిషి చప్పుడు వినగానే జంతువులు ఆమడ దూరం పారిపోతుంటాయి. చాలా మంది వేటగాళ్లు ఎంతో చాకచక్యంగా వేటాడుతుంటారు. కొందరు ఉచ్చు వేసి వేటాడితే.. మరికొందరు దూరం నుంచి తుపాకీ గురిపెట్టి వేటాడుతుంటారు. అయితే..

వేటాడే క్రమంలో మనిషి చప్పుడు వినగానే జంతువులు ఆమడ దూరం పారిపోతుంటాయి. చాలా మంది వేటగాళ్లు ఎంతో చాకచక్యంగా వేటాడుతుంటారు. కొందరు ఉచ్చు వేసి వేటాడితే.. మరికొందరు దూరం నుంచి తుపాకీ గురిపెట్టి (Animal hunting) వేటాడుతుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి జింకకు తుపాకీ గురిపెడతాడు. తీరా కాల్చబోతుండగా జింక గమనిస్తుంది. వెంటనే పారిపోవాల్సిన జింక.. వేటగాడి దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలో (Forest area) వేటకు వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఓ జింక (deer) కనపడుతుంది. వెంటనే తుపాకీ గురి పెడతాడు. జింక అటూ ఇటూ కదులుతుండడంతో టార్గెట్ మిస్ అవుతూ ఉంటుంది. కాసేపటికి సరిగ్గా గురి పెట్టి కాల్చడానికి (Gun firing) సిద్ధమవుతాడు. అయితే అదే సమయంలో జింక అతన్ని గమనిస్తుంది. వెంటనే పారిపోవాల్సిన జింక.. ఆశ్చర్యకరంగా పరుగుపరుగున అతడి వద్దకు చేరుకుంటుంది.
తుపాకీ గురిపెట్టినా భయపడకుండా.. కదలకుండా అలాగే నిలబడుతుంది. ‘‘నిజం చెప్పు.. నన్ను చూస్తే నీకు చంపాలని అనిపిస్తోందా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. జింకను చూడగానే ఆ వ్యక్తి కూడా చలించిపోతాడు. తుపాకీ కిందకు దించి.. జింక తలపై చేత్తో ప్రేమగా నిమురుతాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ముద్దొస్తుంది.. చంపను.. అని హామీ ఇచ్చినట్లుగా దాన్ని దగ్గరకు తీసుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.