Vijay Deverakonda: హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా..?

ABN , First Publish Date - 2023-02-05T13:53:09+05:30 IST

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Vijay Deverakonda: హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా..?

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘ఖుషి’ (Kushi) లో నటిస్తున్నారు. సమంత అనారోగ్యంతో బాధపడుతుంటంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈ విరామ సమయంలో ‘రౌడీ’ హీరో వరుసగా కథలు వింటున్నారు. తాజాగా మరో డైరెక్టర్‌కు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.

‘సర్కారు వారి పాట’ డైరెక్టర్ పరశురాం (Parasuram)తో విజయ్ సినిమా చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించనున్నారని సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. విజయ్, పరశురాం కలసి గతంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) కు పనిచేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితమే యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి ఒకే చెప్పారు. ఈ ప్రాజెక్టును సితార ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మించనుంది. విజయ్ ఈ సినిమాలో గూఢచారిగా కనిపించనున్నారు. ‘రౌడీ’ హీరో చివరగా ‘లైగర్‌’ లో నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

Updated Date - 2023-02-05T13:53:10+05:30 IST