Viral News: ఎన్నో ఏళ్లుగా దాచిన నిజం.. పొరపాటున అసలు జీతమెంతో తల్లికి చెప్పిన కొడుకు.. ఆ తర్వాత అతడి పరిస్థితి ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-07-04T11:18:03+05:30 IST
తల్లిదండ్రులు(parents) ఎప్పడూ పిల్లలు బాగుండాలనే అనుకుంటారు. కానీ ఇలాంటి ఆలోచనలో కొంతమంది తమ పిల్లలను కంట్రోల్ చేస్తుంటారు. కానీ..
పిల్లలు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా వచ్చే సంపాదన దగ్గర మాత్రం వారికి తగిన స్వేచ్చ ఉండదు. మరీ ముఖ్యంగా తల్లులు డబ్బు దగ్గర పిల్లలను చాలా కంట్రోల్ చేస్తారు. ప్రతి రుపాయి గురించి ఆరా తీస్తారు. ఓ కుర్రాడికి తన తల్లితో ఇదే సమస్య వచ్చి పడింది. అతను స్వేచ్చగా ఏదీ ఖర్చుపెట్టేంత, కొనుక్కునేంత వెసులుబాటు లేదు అతనికి. దీంతో అతను తనకు ఉద్యోగం వచ్చాక తన శాలరీ విషయంలో అబద్దం చెప్పాడు. తనకు తక్కువ శాలరీ వస్తుందని తల్లిని నమ్మించాడు. కొన్ని ఏళ్ళు అలా గడిచిపోయాక ఊహించని విధంగా అసలు నిజం బయటపడింది. ఆ తరువాత జరిగిన సంఘటనలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. 'ఇప్పుడు నా పరిస్థితి ఇది' అంటూ అతనే స్వయంగా సోషల్ మీడియాలో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అసలింతకూ నిజం తెలిశాక ఏం జరిగింది? అతని బాధకు కారణమేంటి పూర్తీగా తెలుసుకుంటే..
తల్లిదండ్రులు(parents) ఎప్పడూ పిల్లలు బాగుండాలనే అనుకుంటారు. కానీ ఇలాంటి ఆలోచనలో కొంతమంది తమ పిల్లలను కంట్రోల్ చేస్తుంటారు(parents control kids). చిన్న పిల్లలను కంట్రోల్ చేసినా ఫర్వాలేదు కానీ వయసులోకి వచ్చి ఉద్యోగాలు కూడా చేస్తున్న పిల్లలను కంట్రోల్ చేయడం అంటే వాళ్ళ స్వేచ్చను హరించడమే. ఓ కుర్రాడికి తన తల్లినుండి ఇదే పరిస్థితి ఎదురయ్యింది(man face problem with mother). అతని తల్లి మొదటి నుండి అతనికి నచ్చినట్టు ఖర్చు పెట్టనిచ్చేది కాదు, ప్రతి విషయంలో తను చెప్పినట్టు జరగాలనేది. అతను ఏమైనా సొంతంగా ఖర్చు చేస్తే దానిగురించి గొడవ పడేది. దీంతో అతను తన శాలరీ విషయంలో తల్లికి అబద్దం చెప్పాడు(lie about salary). కొన్నేళ్ళ పాటు ఈ విషయం రహస్యంగా ఉండిపోయింది. అన్నిరోజులూ ఆ కుర్రాడు బాగా ఖర్చు పెడుతూ ఎంజాయ్ చేశాడు. ఓరోజు అతను ఆఫీసు పనికోసం ఇంట్లో ఉన్న గదిలోకి అదనంగా ఒక ఏసీని కొనుగోలు చేశాడు. దీంతో 'దుబారా ఖర్చులు పెడతావెందుకు?' అంటూ తల్లి గొడవ మొదలుపెట్టింది. ఈ గొడవలో అతను తన శాలరీ గురించి నిజం బయటపెట్టాడు. అతనలా చెప్పడమే అతని కొంప ముంచింది.
Viral Video: నిజమైన హీరో నువ్వేనయ్యా.. ఆవు పీక పట్టుకుని చంపుతున్న సింహాన్ని ఒంటిచేత్తో ఉరికించాడు..
కొడుకు నిజ సంపాదన ఎంతో తెలిసిన తరువాత ఆ తల్లి గొడవ అయితే ఆపింది కానీ కొడుకుకు వస్తున్న నిజమైన శాలరీ గురించి ఇరుగు పొరుగు వారికి, బంధువులకు చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ నా శాలరీ గురించి గర్వంగా చెప్పుకుని ఉండవచ్చు, కానీ ఈ కారణంగా నాకు ఆమె తరపు బంధువులనుండి ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. డబ్బు అప్పుగా ఇవ్వమని అడుగుతున్నారు. నేను ఇంతకుముండే అప్పు ఇచ్చినవాళ్ళు అదివ్వకపోగా మళ్లీ అప్పు ఇవ్వమంటూ అడుగుతున్నారు. నేను మునుపటిలాగా సరదాగా టూర్లకు వెళితే అవి ఇన్స్టాగ్రామ్ లో పంచుకోలేకపోతున్నాను. నా సంపాదనను ముందులా హాయిగా ఖర్చుచెయ్యలేకపోతున్నాను అంటూ రెడ్డిట్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఈ సంగతంతా పంచుకున్న తరువాత నెటిజన్లు ఈ విషయంపై స్పందించడం మొదలుపెట్టారు. 'మీరు మొదట అప్పులు అడిగే వారికి నో చెప్పడం నేర్చుకోండి' అని ఆ కుర్రాడికి సలహా ఇచ్చారొకరు. ' శాలరీ ఎంత అనే నిజాన్ని ఎప్పటికీ బందువులకు చెప్పకూడదు' అని మరొకరు కామెంట్ చేశారు. 'మిమ్మల్ని ఎవరైనా అప్పు అడిగితే దేంట్లోనో లాస్ అయ్యానని' చెప్పండి అంటూ మరొకరు సలహా ఇచ్చారు.