Viral Video: ఈ ఆటోడ్రైవర్ మామూలోడు కాదు.. అందరూ ప్రయోణించే ఆటోను ఇతనెలా మార్చేశాడో చూస్తే!!

ABN , First Publish Date - 2023-08-31T11:22:29+05:30 IST

ఈ ఆటోను చూసిన వారు ఒక్కసారైనా అందులో ప్రయాణించాల్సిందేనని అంటున్నారు. అంత ప్రత్యేకత ఇందులో ఏంముందంటే..

Viral Video: ఈ ఆటోడ్రైవర్ మామూలోడు కాదు..  అందరూ ప్రయోణించే ఆటోను ఇతనెలా మార్చేశాడో  చూస్తే!!

అటోలు ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణించడం నుండి, పట్టణాలు నగరాల్లో చిన్న చిన్న దూరాలు చేరుకోవడం వరకు ఆటోలవైపు మొగ్గు చూపేవారు ఎక్కువ. అయితే కొన్నిసార్లు ఆటోల వల్ల అసహనం కలుగుతుంది కూడా. కానీ ఇదిగో ఈ ఆటో చూస్తే ఒక్కసారైనా ఈ ఆటోలో ప్రయాణించాలని అనుకుంటారు . అంత ప్రత్యేకత ఇందులో ఏముందో అని డౌట్ వస్తుందేమో. ఈ ఆటోకు సంబంధించి ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నోళ్లు వెళ్ళబెడుతున్నారు. 'ఒక్కసారైనా ఇందులో ప్రయాణించాల్సిందే' అని అంటున్నారు. చెన్నై ఆటో డ్రైవర్ చేసిన అధ్బుతం ఏంటో తెలుసుకుంటే..

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చెన్నై(Chennai)లోని ఓ ఆటో డ్రైవర్(auto driver) వినూత్న ఆలోచన ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. వీడియోలో ఓ ఆటో కనిపిస్తుంది. ఈ ఆటోలోపల చుట్టూ చిన్న చిన్న మొక్కలు, పువ్వులు ఏర్పాటు చేశారు(plants arrange in auto walls). ఆటో వెనుక భాగంలో కూడా కుండీలలో పెరిగే కొన్ని మొక్కలు ఉంచారు. ఇక ఆటో లోపల పైభాగం అయితే పచ్చని పందిరి వేశారా అన్నట్టుంది. ఆటో లోపల పై భాగంలో ఉండే కడ్డీలకు అటువైపు ఇటువైపు ప్లాస్టిక్ కుండీలలో మొక్కలను వేలాడదీశారు. ఇక కూర్చునే సీటు ముందు భాగంలో కూడా ఓ రెండు మొక్కల కుండీలున్నాయి. ఆటోలోపల కింది భాగం పచ్చని పచ్చికలా ఉండే కార్పెట్ ఏర్పాటు చేశారు. పచ్చని వాతావరణం మధ్య ఆ ఆటోలో ప్రయాణం చేస్తుంటే అదేదో ట్రావెలింగ్ పార్క్ లా అనిపిస్తుంది. ప్రయాణికులకు రిఫ్రెష్ వాతావరణాన్ని కల్పించడానికి, పర్యావరణ పరిరక్షణ మీద ఉన్న స్పృహతో అతనిలా ఏర్పాటు చేశాడట. ఇక మరొక ముఖ్య విషయం ఏమిటంటే డ్రైవర్ సీటు వెనుక భాగంలో, ప్రయాణికుల సీటుకు ఎదురుగా కనిపించేలా అతను ఏర్పాటు చేసిన ఇంగ్లీషు వాక్యాలు. 'if you have power please help the poor' అని రాసుంది. 'మీకే శక్తి ఉంటే పేదవారికి సహాయం చెయ్యండి' అన్నది ఈ వాక్యాల సారాంశం.

Viral: విమానంలో ఓ బొమ్మను మర్చిపోయిందో 9 ఏళ్ల పాప.. 9600 కిలోమీటర్లు ప్రయాణించి మరీ తిరిగి ఇచ్చేసిన పైలెట్..!



ఈ వీడియోను depthoughtsz అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'అతని ఇంటీరియర్ పనితనాన్నిమెచ్చుకోకుండా ఉండలేం. ఎంత గొప్పగా డిజైన్ చేసుకున్నాడో' అని ఒకరు అన్నారు. 'ఆ డ్రైవర్ సంపాదించుకున్నదంతా ఆటోను అప్ గ్రేడ్ చేయడానికే ఖర్చుపెట్టినట్టు ఉన్నాడు' అని మరొకరు అన్నారు. 'చెన్నైలో నేను ఆ ఆటోలో ప్రయాణించాను. అతను చాలా వినయంగా ఉంటాడు. అతని ప్రవర్తన చాలా నచ్చింది. కేవలం మొక్కలను పెట్టడమే కాదు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా అతను హ్యాండిల్స్, ఫైర్ యాక్సిడెంట్స్ వంటివి జరిగినప్పుడు రక్షణగా మంటలు ఆర్పడానికి గ్యాస్ వంటివి కూడా ఏర్పాటుచేశాడు' అని ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు.

Viral Video: అయ్యో పాపం ఈ వధువు.. వరుడితో కలిసి డాన్స్ చేస్తోంటే.. ఇలా జరిగిందేంటి..?


Updated Date - 2023-08-31T11:22:29+05:30 IST