Viral Video: వామ్మో ఇతను మనిషా లేక మానవాతీత శక్తా.. నదిలో ఎదురుగా ప్రత్యక్షమైన మొసలి.. ఇతనేం చేశాడో చూస్తే..

ABN , First Publish Date - 2023-07-23T16:37:12+05:30 IST

మొసలి నోటికి చిక్కితే మనిషి అయినా, జంతువులయినా కండలూడగొట్టుకోవాల్సిందే. పడవమీద నదిలోకి వెళ్ళాడో వ్యక్తి. అతను పడవ అంచున కూర్చుని ఉంటే అతని ముందు మొసలి ప్రత్యక్ష్యం అయ్యింది. ఆ తరువాత జరిగిన సంఘటన చూస్తే..

Viral Video: వామ్మో ఇతను మనిషా లేక  మానవాతీత శక్తా.. నదిలో  ఎదురుగా  ప్రత్యక్షమైన మొసలి.. ఇతనేం  చేశాడో చూస్తే..

'నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు' అని వేమన ఏనాడో చెప్పాడు. అంత పెద్ద ఏనుగునే భయపెట్టగల మొసలికి మనిషి అంటే లెక్క కాదు. ఇక మొసలి నోటికి చిక్కితే మనిషి అయినా, జంతువులయినా కండలూడగొట్టుకోవాల్సిందే. పడవమీద నదిలోకి వెళ్ళాడో వ్యక్తి అతను పడవ అంచున కూర్చుని ఉంటే అతని ముందు మొసలి ప్రత్యక్ష్యం అయ్యింది. ఆ తరువాత జరిగిన సంఘటనలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 'నాయనా అదేమైనా మీ ఇంట్లో కుక్క అనుకున్నావా?' అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

కుక్కలు, పిల్లులు, చిలుకలు, కుందేళ్లు ఇలా మనిషికి దగ్గరయ్యే జంతువులు చాలానే ఉన్నాయి. వీటిని పెంచుకోవడం, ఆహారం పెట్టడం చాలా సహజమైన విషయం. అయితే కొందరు భయం పుట్టేలా క్రూర జంతువుల(wild animals)తో సావాసం చేస్తుంటారు. వీడియోలో ఓ వ్యక్తి నదిలో ఉన్నాడు. అతను తన పడవ అంచుమీద కూర్చుని తన కాళ్లను నీళ్లలో వదిలేశాడు(man sitting at boat edge). సరిగ్గా అప్పుడే నదిలో ఓ మొసలి(crocodile) ప్రత్యక్షం అయింది. అది నేరుగా అతని ముందుకు వచ్చి తల పైకెత్తింది. వేరే ఎవరైనా అయితే ఆ మొసలిని చూసి గుండె ఆగి చచ్చేవాళ్ళే, కానీ అతను మాత్రం ఆ మొసలిని చంటి బిడ్డలా ముద్దు చేస్తున్నాడు. తన దగ్గరున్న మాంసపు కండను ఒకదాన్ని చేతిలో తీసుకుని మొసలికి చూపిస్తూ ఆటపట్టిస్తున్నాడు. మొసలి మాంసం కండ కోసం పైకి ఎగురుతోంటే అతను తన కాళ్లను పొడవుగా చాపి మొసలిని కాళ్ళ మధ్య పట్టుకున్నాడు. ఆ తరువాత మొసలి నోట్లో మాంసపు కండ వేశాడు. మొసలి ఇంకా ఏమైనా వేస్తావా అన్నట్టు అతని వైపు చూస్తోంటే అతను తన చేత్తో దాని నోటిని మూసి తన కాళ్ళు వెనక్కు తీసుకున్నాడు. దీంతో ఆ మొసలి నీళ్ళలో ఈదుకుంటూ వెళ్లిపోయింది.

Monsoon Hair Fall: వర్షాకాలంలోనే కొందరికి ఎందుకిలా..? విపరీతంగా జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే..!


ఈ వీడియోను HoodFamousTV అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'సార్ అది కుక్క కాదు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పంచులు, సెటైర్లతో స్పందిస్తున్నారు. 'అతను చాలామంచి అబ్బాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అది పెంపుడు మొసలిలా ఉంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'ఇది ఫ్లోరిడాలా అనిపిస్తోంది' అని మరికొందరు అంటున్నారు.

Health Tips: తెలియక చేస్తున్న మిస్టేక్ ఇదే.. పొరపాటున కూడా రెండోసారి వేడి చేయకూడని ఆహార పదార్థాలివీ..!


Updated Date - 2023-07-23T16:43:16+05:30 IST