Viral Video: మహిళా లోకో ఫైలెట్ డ్రైవింగ్ చూశారంటే ఫిదా అవుతారు.. వందేభారత్ ఎక్స్పెస్ ఈమె చేతుల్లో బొమ్మలా మారిపోయింది..
ABN , First Publish Date - 2023-03-15T18:25:17+05:30 IST
దానివేగం చూస్తేనే కొందరు భయపడతారు అలాంటిది ఎత్తైన ఘాట్ మీద..
ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఏదో ఒక సమాచారం నెట్టింట్లో వస్తూనే ఉంది. ఈ ట్రైన్ వేగం, దీనిలో సౌకర్యాలు, టికెట్ ధర వీటన్నిటిపరంగా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వందేభారత్ కు మహిళా శక్తికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఓ మహిళా లోకో ఫైలట్ విజయవంతంగా నడిపింది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సగర్వంగా ట్వి్ట్టర్ లో షేర్ చేసింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..
ముంబై(Mumbai)లోని షోలాపూర్-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(Solapur-Chhatrapati shivaji maharaj Terminus) మధ్య మొదటిసారిగా సెమీ-హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్(Semi-Hight Speed Vande Bharat Express) ను ఆసియా తొలి లోకో ఫైలట్ సురేఖ యాదవ్(Asia First Locopilot Surekha Yadav) నడిపారు.షోలాపూర్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ కు మధ్య 450కిలోమీటర్ల దూరముంది. అంత వేగవంతమైన ట్లైన్ ను 450కిలోమీటర్ల మేర కీ ఇచ్చిన ట్రైన్ లా పరుగులు పెట్టించింది సురేఖ. ట్రైన్ గమ్యస్థానానికి చేరాల్సిన సమయం కంటే 5నిమిషాలు ముందుగానే చేరుకుందట. దీంతో సెంట్రల్ రైల్వే వారు లోకో ఫైలట్ సురేఖను సత్కరించారు. భారతీయ రైల్వే చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో సురేఖ యాదవ్ లిఖించుకుందని ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా సురేఖ ఎత్తైన ఘాట్ లో ట్రైన్ నడుపుతున్నప్పుడు వీడియో తీశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తమ ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ట్రైన్ ఎత్తైన ఘాట్ కు చేరుకోగానే సురేఖ చాలా థ్రిల్ ఫీలయినట్టు చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది భారతీయ మహిళా శక్తి అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికవేగంతో పరుగులు పెట్టే ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ ను బొమ్మలాగా ఆడించేసింది ఈ లోకో ఫైలట్ అని ఆమెను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు.