Health Tips: ఈ సప్లిమెంట్లు వాడితే వృద్ధుల్లో గుండెపోటు రాదట..అవేంటంటే..
ABN , First Publish Date - 2023-07-02T20:45:54+05:30 IST
విటమిన్ డి(Vitamin D) సప్లిమెంట్ తీసుకుంటున్న వృద్ధుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు.
గుండెపోటు(Heart Attacks) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణాలలో ఇది ఒకటి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని వయసుల వారు గుండెపోటుకు గురవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ గుండెపోటు, స్ట్రోక్స్ వంటి కార్డియాక్ వాస్కులర్ డిసీజ్‌లు(Cardiovascular disease (CVD) పెరుగుతాయట. అయితే విటమిన్ డి(Vitamin D) సప్లిమెంట్ తీసుకుంటున్న వృద్ధుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు.
గుండె లేదా రక్త నాళాలను ప్రభావితం చేసే పరిస్థితులను కార్డియోవాస్కులర్ డిసీజ్(CVD) అంటాం. వయస్సు పెరుగుతున్న కొద్దీ గుండెపోటు, స్ట్రోక్స్ సాధారణం అంటున్నారు డాక్టర్లు. ఇటీవల పరిశోధనల్లో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. అందేంటంటే..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని QIMR బెర్ఘోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో సహా పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. విటమిన్ D సప్లిమెంట్ గుండె, హృదయ నాళంలో పోటును తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
BMJ అధ్యయనం ప్రకారం..21,315 మందిలో ప్రధాన హృదయ సంబంధ సంఘటనల రేటు ప్లేసిబో సమూహంతో పోలిస్తే విటమిన్ డి తీసుకున్నవారిలో 9 శాతం తక్కువగా ఉందని తేలింది. విటమిన్ డి గ్రూపులో గుండెపోటు రేటు 19 శాతం తక్కువగాను, కరోనరీ రివాస్కులరైజేషన్ రేటు 11 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.