Ruturaj Gaikwad: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు రుతురాజ్ దూరం
ABN , First Publish Date - 2023-01-26T21:07:28+05:30 IST
మణికట్టు గాయంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20
రాంచీ: మణికట్టు గాయంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. సిరీస్‌లో భాగంగా శుక్రవారం (27న) రాంచీలో తొలి మ్యాచ్ జరగనుంది. గాయంతో బాధపడుతున్న రుతురాజ్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నాడు.
25 ఏళ్ల రుతురాజ్ చివరిసారి రంజీలో మహారాష్ట్ర తరపున ఆడాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 8, 0 పరుగులు మాత్రమే చేశాడు. రుతురాజ్ మణికట్టు సమస్యతో బాధపడడం ఇదే తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక (Sri Lanka)తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా ఇదే సమస్యతో దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని మయాంక్ అగర్వాల్(Mayank Agarwal)తో భర్తీ చేశారు.
జులై 2021లో టీ20ల్లో అరంగేట్రం చేసిన గైక్వాడ్ 9 మ్యాచుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఇప్పుడు గైక్వాడ్ దూరం కావడంతో అతడి స్థానాన్ని పృథ్వీషాతో భర్తీ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించడంతో హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. 27న రాంచీలో తొలి టీ20, 29న లక్నోలో రెండోది, ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో చివరి మ్యాచ్ జరుగుతాయి.