Shastri: డ్రెస్సింగ్ రూమ్ గురించి రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించిన రవిశాస్త్రి
ABN , First Publish Date - 2023-06-24T18:53:52+05:30 IST
అశ్విన్ వ్యాఖ్యలపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని అడగగా, సూటిగా సమాధానం ఇచ్చాడు.
టీం ఇండియా క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ గురించి (Indian cricket team dressing room) భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (spinner Ravichandran Ashwin) చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) స్పందించారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు ఓడిపోయిన తర్వాత అనేక విషయాల గురించి అశ్విన్ ప్రస్తావించాడు. ప్రస్తుతం టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో 'స్నేహితులు' చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని, వారిలో ఎక్కువ మంది 'సహోద్యోగులు' అని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై నిపుణులు, అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
అశ్విన్ వ్యాఖ్యలపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని అడగగా, సూటిగా సమాధానం ఇచ్చాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ ఎవరికైనా ఎంత మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు?, వెళ్లి ఎవరినైనా అడిగితే 4-5 మంది అంటారని, వాళ్ల జీవితంలో!.. తన జీవితంలో 5 మంది సన్నిహితులతో తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. అంతకు మించి తనకు అక్కర్లేదని ఓ ఇంటర్వ్యూలో శాస్త్రి అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అశ్విన్‌ని తీసుకోలేదని, రవీంద్ర జడేజాను మాత్రమే స్పిన్‌గా ఎంపిక చేసిందన్నాడు.