Share News

BRS: భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్

ABN , Publish Date - Dec 23 , 2024 | 12:52 PM

ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని, గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.

BRS: భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్

హైదరాబాద్: ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు (Former PM, PV Narasimha Rao) వర్ధంతి (Death anniversary) సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) పీవీ ఫోటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి.. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం.. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.. నెక్లెస్ రోడ్‌కు పీవీ మార్గ్ అని పేరు పెట్టి.. పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ గారి పేరు పెట్టింది. . అంతే కాదు.. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపింది. పీవీ గారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందని..జోహార్ పీవీ..’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


కాగా ‘కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి చూస్తే.. కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని.. అసెంబ్లీలో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు. రైతన్నలారా.. పెట్టుబడి సాయం అందించకుండా రైతు భరోసా ఎగవేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ సర్కారును ఎదిరించండి’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణలోని అన్నదాతలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లకు, క్వారీలకు రూ.22 వేల కోట్లు రైతు బంధు పేరిట ఇచ్చారని కాంగ్రెస్‌ సర్కారు దుర్మార్గ ప్రచారంతో రైతులను అవమానిస్తోంది. రైతాంగం మోసపోకుండా జాగ్రత్తపడాల్సిన సందర్భమిది.. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం.. మాయోపాయం చేసి మమ అనిపించి.. ఆ తర్వాత పెట్టుబడి సాయానికి పూర్తిగా సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదు గోస మాత్రమే మిగులుతుంది’ అని కేటీఆర్ అన్నారు.


‘అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట రూ.15 వేలు పెట్టుబడి ఇస్తామన్నారు. ఏడాది గడిచినా దాని జాడేలేదు. ఇక సంక్రాంతి తర్వాత వేస్తామంటున్న రైతు భరోసా కౌలు రైతులకు వేస్తారా? లేదా చెప్పడం లేదు. ఈ వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగికి రూ.2,500 కోత వేశారు. రేవంత్‌ సర్కారు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డది.. ఆ డబ్బులను రైతులు వదులుకోవద్దు. రాష్ట్రంలో 70 లక్షలకు పీఎం కిసాన్‌ రావాల్సి ఉన్నా.. 30 లక్షల మందికి కూడా దక్కడం లేదు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పడిపోతోంది. చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం ఇప్పటికైనా కాంగ్రెస్‌ సర్కారు ఎత్తులను తిప్పికొట్టాలి. గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలను గల్లాపట్టి నిలదీయాలి. మేమూ.. మీతో కలిసి నడుస్తాం.. మీ ఆందోళనకు అండగా ఉంటాం’అని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే.. సీఎం రేవంత్‌.. కృష్ణాజలాల్లో తెలంగాణ నీటి వాటా గురించి నోరు తెరవడం లేదని ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా కాంగ్రెస్‌కు పట్టడం లేదని, కాళేశ్వరం నుంచి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించినా చలనం లేదని కేటీఆర్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా..: సోమిరెడ్డి

కడపలో టెన్షన్.. టెన్షన్..

యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..

కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 23 , 2024 | 12:53 PM