CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2023-12-05T21:59:31+05:30 IST
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) నివాసం వద్ద పోలీస్ ఆంక్షలు మొదలయ్యాయి. ఇంటివద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) నివాసం వద్ద పోలీస్ ఆంక్షలు మొదలయ్యాయి. ఇంటివద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు. రేవంత్ నివాసం నుంచి బయటకు వచ్చే రూట్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. రేవంత్ నివాసం వద్ద చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తుంది. సీఎల్పీ నేత, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బారీగేట్లు వేసి ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే రేవంత్ నివాస పరిసర ప్రాంతాలను ఇంటెలిజెన్స్ పోలీసులు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం తాత్కాలిక సీఎం కాన్వాయ్‌ను అధికారులు సిద్ధం చేశారు.