‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , First Publish Date - 2023-03-05T00:37:45+05:30 IST

ఎస్టీ హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థుల పరీక్షల్లో మంచి ఫలితాల సాధించేలా కార్యచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి కేఈ.రామేశ్వరిదేవి, కార్యాలయ ఈఈ, టెన్త్‌ పరీక్షల ప్రత్యేకాధికారి ఫణికుమారి అన్నారు.

‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మాట్లాడుతున్న ఫణికుమారి

కడ్తాల్‌, మార్చి 4: ఎస్టీ హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థుల పరీక్షల్లో మంచి ఫలితాల సాధించేలా కార్యచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి కేఈ.రామేశ్వరిదేవి, కార్యాలయ ఈఈ, టెన్త్‌ పరీక్షల ప్రత్యేకాధికారి ఫణికుమారి అన్నారు. దీనికి ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. కడ్తాల్‌లోని ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం అధికారులు సందర్శించారు. స్కూలు రికార్డులు పరీశిలించి విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయం పాలన వేడుకలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హాస్టల్‌ విద్యార్థులు ఐదేళ్లుగా 100శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని ప్రశంసించారు. ఈ సారీ అదే ఫలితాన్ని కొనసాగించి ఉత్తమ గ్రేడ్ల సాధనకు పాటుపడాలన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగలన్నారు. టెన్త్‌ విద్యార్ధులకు ఉదయం, సాయంత్రం అల్పహారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సబ్జెక్టుల్లో వీక్‌ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం బాగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి రాములు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:37:58+05:30 IST