Aaryajanani: ఆర్యజననికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? | Aaryajanani Prenatal ONLINE session Ojas is scheduled for February 5th in RamaKrishna Math, nrao

Aaryajanani: ఆర్యజననికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా?

ABN , First Publish Date - 2023-02-02T19:27:23+05:30 IST

గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని (Aaryajanani) ఈ నెల 5వ తేదీన వర్క్‌షాప్ నిర్వహించనుంది.

Aaryajanani: ఆర్యజననికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా?
Aaryajanani

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని (Aaryajanani) ఈ నెల 5వ తేదీన వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి 12 వరకూ తెలుగు భాషలో ఆన్‌లైన్ వర్క్ షాప్ నిర్వహిస్తారు.

ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు గర్భిణులకు వివరిస్తారు.

ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తికలవారు https://aaryajanani.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-02-02T19:27:28+05:30 IST